సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులే బలం..తమ అభిమాన హీరోల సంఘాలు ఏర్పాటు చేసుకొని తమ ప్రాబల్యం చూపించుకుంటారు.  ఇక ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ నెల ముందు నుంచి హంగామా మొదలు పెడుతుంటారు.  సినిమా రిలీజ్ ముందు రోజుల పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి పూలదండలు వేసి..పాలాభిషేకం కూడా చేస్తుంటారు. 
Image result for pawan fans
తమ హీరో సినిమా ఎలా ఉన్నా ఆహా..ఓహో అని తెగ పొగిడేస్తుంటారు.  అయితే ఒకే సమయంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే..తమ అభిమాన హీరో గొప్ప అంటే..తమ హీరో గొప్ప అని గొడవ పడుతుంటారు.  ఒక్కోసారి ఈ గొడవలు కాస్త ముదిరి తన్నులాడుకునే పరిస్థితికి కూడా చేరుకుంటుంది. 
Image result for pawan fans
ఇలాంటి గొవల్లో ఒక్కోసారి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.  గతంలో పవన్ అభిమాని మరో హీరో అభిమానికి చంపిన సంగతి ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే.  గతంలో భీమవరంలో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ కి మద్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి.  తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టాలీవుడ్ అగ్ర హీరోల అభిమానుల మధ్య మొదలైన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది.

పురుషోత్తపురంలో పవన్ కల్యాణ్, బాలకృష్ణ అభిమానుల మధ్య  చిన్న వివాదం కొట్టుకునే పరిస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో బాలకృష్ణ అభిమాని పవన్ అభిమానిపై బ్లేడుతో దాడి చేశాడు. బాలయ్య అభిమాని దాడిలో పవన్ ఫ్యాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: