వచ్చే ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వస్తే అమలు చేయడం కష్టమని తెలిసినా ఎన్నో హామీలు గుప్పిస్తున్నారు. నవరత్నాల పేరుతో అలవికాని హామీలు చేసి చూపిస్తామని భరోసా ఇస్తున్నారు. తప్పుదు.. ఆయనకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే వైసీపీకి నామరూపాలు లేకుండాపోవచ్చు. 

JANMABHOOMI CHANDRABABU కోసం చిత్ర ఫలితం

ఐతే.. పాదయాత్ర ద్వారా కాస్త సానుకూల వాతావరణ ఏర్పడుతోంది. నవరత్నాలను కూడా జగన్ టీమ్ బాగానే ప్రచారం చేస్తోంది. వీటికి తోడు 45 ఏళ్లకే ఫించన్ అంటూ కొత్త వాగ్దానాలు సైతం అప్పటికప్పుడు గుప్పిస్తున్నారు. ఇంతాచేస్తే.. ఇప్పుడు జగన్ కు కొత్త భయంపట్టుకుందట. అదేంటో తెలుసా.. అధికార పక్షం నిర్వహించిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని అధికార పార్టీ జబ్బలు చరుచుకుంటోంది. 

JAGAN PADAYATRA కోసం చిత్ర ఫలితం

ఈసారి జన్మభూమిలో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు ప్రజలతో మమేకమైందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92 వేల 618 గ్రామ సభలు నిర్వహించారట. ఇలా ఏ దేశంలోనూ జరగలేదని చెబుతున్నారు. అంతే కాదు..  గతానికి భిన్నంగా ఈసారి రోజుకో అంశం తీసుకుని జన్మభూమి నిర్వహించామంటున్నారు. అందుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆనంద పరవశులవుతున్నారు. 

JANMABHOOMI CHANDRABABU కోసం చిత్ర ఫలితం

ఈ ఐదో విడత జన్మభూమిలో మొత్తం లక్షా 83 వేల రేషన్ కార్డులు పంపిణీ చేశారట. లక్షా 10 వేల పెన్షన్ లు జారీ చేశారట. పది రోజుల్లో ప్రజలను సంతృప్తి పరిచేలా జన్మభూమి నిర్వహించారట. జన్మభూమిలో అర్జీలు పరిష్కరించడమే కాకుండా 9 రోజులు 9 అంశాలపై చర్చించారట. ఇదంతా నిజమైతే ఇది అధికార పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఇదే భయం జగన్ టీమ్ లో కనిపిస్తోంది. కానీ ఇవన్నీ అధికార పార్టీ చెప్పే లెక్కలేనని.. వాస్తవానికి అంత సీన్ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: