అమెరికా దేశాధ్యక్షుడిగా  డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముడుదూనే ఉన్నాయి.  పలు దేశాల విషయాల్లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మింగుడు పడటం లేదు. వీసా నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన ప్రకటించడంతో విదేశీ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. హెచ్ 1 బి వీసా నిబంధనలపై అందోళన చెందుతోన్న భారతీయులకు ట్రంప్ సర్కార్ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.  విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద వూరట లభించింది.
Image result for డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా
వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను అమెరికా నుంచి వెనక్కి పంపే ప్రతిపాదనలను అమలు చేయబోమని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. అమెరికాకు వలస వచ్చిన నిపుణులను అవమానించే రీతిలో ఆ దేశాధ్యక్షుడు డోనాట్లడ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. 'చెత్త దేశాల నుంచి వచ్చే వీళ్లందరూ (వలసవాదులు) మనకెందుకు?' అని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో నాలుగు గోడల మధ్య ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
Image result for డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా
తగిన ప్రాతినిధ్యం లేని ఆఫ్రికా దేశాలకు కేటాయించాలంటూ లిండ్సే గ్రాహమ్ ఓ ప్రణాళికలను ట్రంప్ కు తెలియజేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ ‘‘హైతి, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారు మనకు ఎందుకు? నార్వే వంటి దేశాల నుంచి అమెరికా ఎక్కువ మందిని ఆకర్షించాలి’’ అని అన్నారు. ఈ విషయానికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  అయితే ఈ విషయాన్ని ఓ వ్యక్తి మీడియాకు ఉప్పందించడంతో విషయం వెలుగు చూసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: