ఔను.. లోకేశ్ చేతిలో చంద్రబాబు ఓడిపోయారు.. అదేమిటీ కొడుకు చేతిలో తండ్రి ఓడిపోవడం ఏమిటనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు కథ. ఏపీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టి దాదాపు 9 నెలలు పూర్తి కావస్తోంది. ఈ తొమ్మిది నెలల్లో పంచాయతీ రాజ్, ఐటీ శాఖలను లోకేశ్ నిర్వహిస్తున్నారు. ఈ రెండు శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్నారు. 

CHANDRABABU LOKESH కోసం చిత్ర ఫలితం

అన్ని గ్రామాలకు ఎల్ ఈడీ లైట్లు.. అండర్ డ్రైనేజీ.. తాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఐటీ శాఖ మంత్రిగా పలు కొత్త కంపెనీలు విజయవాడకు తరలివచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. విదేశాలకు వెళ్లి మరీ కొన్ని కంపెనీలను ఆహ్వానించి వచ్చారు. మొత్తానికి బాగా కష్టపడుతున్నాడనే ఫీలింగ్ ప్రజలకు కల్పించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అందులో కొంత వరకూ విజయవంతం అయ్యారు. 

CHANDRABABU LOKESH కోసం చిత్ర ఫలితం
ఇక్కడ ఓ తమాషా విషయం ఏమిటంటే.. నారా లోకేశ్ , చంద్రబాబు ఇద్దరూ విజయవాడలోని సీఎం నివాసంలోనే ఉంటున్నారు. నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి హైదరాబాద్ లో ఉంటూ హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. వీకెండ్స్ లోనే ఫ్యామిలీ కలిసేది. ఐతే.. మంత్రి ఐన తొలిరోజు నుంచి లోకేశ్ తండ్రి కంటే లేటుగా ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ ఒక్కరోజుకు కూడా సాధ్యపడటం లేదట. 

CHANDRABABU LOKESH కోసం చిత్ర ఫలితం

ఏ రోజు ఇంటికి వెళ్లినా.. తాను వెళ్లిన తర్వాతే ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్నారట. అంటే అంత బిజీగా చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉంటున్నారన్నట. కానీ ఈ తొమ్మిదినెలల్లో ఒక్కసారి మాత్రం లోకేశ్ కంటే ముందే చంద్రబాబు ఇంటికి వెళ్లిపోయారట. హమ్మయ్య ఈ రోజు మా నాన్నను ఓడించారు.. ఆయన కంటే ఆలస్యంగా ఇంటికెళ్తున్నానని లోకేశ్ సంబరపడిపోయారట. కానీ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ కూడా చంద్రబాబు ఆఫీసర్లతో సమీక్షలు చేస్తూ కనిపించారట. అంటే లోకేశ్ గెలిచికూడా ఓడారన్నమాట. బాబు ఓడి గెలిచారన్నమాట. ఇదీ తండ్రీ కొడుకుల గెలుపు ఓటముల కథ.



మరింత సమాచారం తెలుసుకోండి: