ఈ మద్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ - కత్తి మహేష్ ల గొడవే వినిపిస్తుంది.  తెలుగు లో బిగ్ బాస్ షో తర్వాత అందులో కంటిస్టేంట్ గా పాల్గొన్న కత్తి మహేష్ తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా పరిచయం అయ్యారు.  స్వతహాగా సినీ విశ్లేషకుడు అయిన కత్తి మహేష్ సినిమాలపై రివ్యూలు రాస్తుంటారు.  అయితే ఆ మద్య పవన్ కళ్యాన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో అప్పటి నుంచి పవన్ అభిమానులకు కత్తి మహేష్ కి మద్య పెద్ద యుద్దమే జరుగుతుంది. 
Image result for pawan fans
ఈ నేపథ్యంలో పలు చానల్స్ లో కత్తి మహేష్ తనపై పవన్ ఫ్యాన్ చేస్తున్న దాడుల గురించి చెప్పుకుంటూ వాపోయారు.   అంతే కాదు పవన్ కళ్యాన్ ప్రతి చర్యలను ఫోకస్ చేస్తూ..తనదైన స్టైల్లో విమర్శించడం మొదలు పెట్టారు.  ఓ వైపు పవన్ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నా..కత్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఈ మద్య వీరి వ్యవహారంలో పూనం కౌర్ ఎంట్రీ ఇవ్వడం..దర్శకులు వివేక్ ఓ చానల్ లో కత్తి మహేష్ తల్లి ప్రస్తావన తీసుకు రావడం..అక్కడ నుంచి కత్తి మహేష్ వెళ్లిపోవడం జరిగింది. 
Image result for katti mahesh crying
ఇలా రోజుకో ఎపిసోడ్ కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మద్య వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మహేష్ కత్తికి కూడా ఓయూ జేఏసీ నుంచి మద్దతు లభించడం గమనార్హం. మహేష్ కత్తికి మద్దతుగా ఓయూ జేఏసీ నాయకులు శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. మహేష్ కత్తి హాజరైన ఈ సమావేశంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై ఓయూ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 పవన్‌పై కత్తి ఆరోపణలు:
'పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం..కత్తి మహేష్‌పై దాడి గనుక జరిగితే పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోం..తాట తీస్తామని హెచ్చరించారు.  సమావేశంలో 'పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' అంటూ జేఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉస్మానియా విద్యార్థులకు తోడు బహుజన సంఘాలు కూడా మహేష్ కత్తికి మద్దతుగా కదలాలనే ఆలోచన చేస్తుండటం గమనార్హం.

 పవన్ కల్యాణ్‌కు హెచ్చరిక..:


మరింత సమాచారం తెలుసుకోండి: