నానాటికి దేశంలో ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా,ఎన్ని చట్టాలు రూపొందించినా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాలను పరిశీలించి చూస్తే ఆడవాళ్ల మీద జరిగే దాడుల్లో భారత్ మొదటి 15 స్థానాల్లోపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అంచనావేయవచ్చు .భారత్ కు వెళ్లే ప్రతి ఒక్క మహిళ జాగ్రత్తగా ఉండండి, భారత్ ను సంచరించేవాళ్ళు అసలు ఈ ప్రదేశాలకు వెళ్ళకండి అని విదేశీ ప్రభుత్వాలు తమ తమ దేశ ఆడవాళ్లను హెచ్చరించాయంటే మన దేశం లో మహిళల స్థితిని ఊహించవచ్చు.


మహిళలపైనదాడులు,అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఒకొక్కరు ఒక్కొక్క కొత్తదారులు అనుసరిస్తున్నారు.కొంతమంది భౌతిక దాడులకు పాల్పడుతూ తమ కోరికలను తీర్చుకుంటుంటే మరి కొంతమంది ఇంటర్నెట్ ఉపయోగించి వారిని వేధింపులకు గురిచేయడం మనం తరచూ టీవీల్లో ,దినపత్రికలలో చూస్తునే ఉన్నాం . ఇక మహిళలను వేధించడానికి, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడానికి కొంతమంది మృగాళ్లు ఎంచుకున్న అస్త్రం సీసీ కెమెరా. మహిళల స్నానాల గదుల్లో,దుస్తులు మార్చుకొనే గదుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ వారి ప్రైవసీ ని దెబ్బతీస్తూ వాటిని అమర్చి బ్లాక్ మెయిల్ చేసి తమకోర్కెలను తీర్చుకుంటూ ఉంటారు.ఇలా కేరళ లో జరిగిన ఒక ఉదంతం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.


వివరాల్లోకెళితే  కేరళలో నివసించే బైజు అనేవ్యక్తి త్రిశూర్ జిల్లాలోని ఒక ఉత్సవంలో  పాల్గొనడానికి వెళ్ళాడు.మహిళ స్కర్ట్ లను వీడియో తీయాలనే దురుద్దేశంతో తను వేసుకొనే చెప్పులకు ముందు భాగంలో ఒక రంధ్రంను చేసి అందులో ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేలా ఒక కెమెరాను అందులో ఉంచాడు.ఇలా ఎవరెవరైతే స్కర్ట్ లలో ఉన్నారో వారిదగ్గరకు వెళ్లి కొద్దిసేపు నిలబడటం ,తరువాత యింకా కొద్దీమంది దగ్గరకు వెళ్లడం చేశాడు .తను చేస్తున్న పనిఅంతా గమనిస్తున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ ఘనుడు చేసిన పని పోలీసులను సైతం నిర్ఘాంతపోయేలా చేసింది .అయితే అతన్ని ఆదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలోనే అతన్ని కోర్టుకు హాజరుపరుస్తామని మీడియాకు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: