దాదాపు ఏడాదిన్నర తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్  దొరికింది. ఈ సందర్భంగా వీరిద్దరి భేటీ పట్ల రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రధాన మోడీని చంద్రబాబు నాయుడు కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీరిద్దరి మధ్య జరిగిన భేటీ గురించి మీడియాతో మాట్లాడారు...ఈ క్రమంలో చంద్రబాబునాయుడు ప్రధాని  మోడీని రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు.

అంతేకాకుండా విభజన సమయంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీ ని చంద్రబాబు అడిగారట, మరియు ప్రత్యేక హోదా కు బదులు ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీ విషయమై స్పష్టత ఇవ్వాలని మరి అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్ గురించి కూడా ప్రధానిని చంద్రబాబు అడిగారట.

నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వెంటనే తేల్చాలని విన్నవించానని చంద్రబాబు తెలిపారు. పోలవరానికి ఇప్పటివరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని, రెవెన్యూ లోటు రూ.3,979 కోట్లు ఇచ్చారని, ఇంకా ఇవ్వాలని ఆయన చెప్పారు.13వ షెడ్యూల్‌లోని విద్యాసంస్థల నిర్మాణానికి రూ.11వేల కోట్లకు గాను రూ.460కోట్లే ఇచ్చారని ఆయన చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కంటే తనకు ఇంకేమీ ముఖ్యం కాదని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా విషయమై రాజీనామా చేస్తానన్నా వారు అడ్రస్ లేకుండా పోయారని పరోక్షంగా వైయస్ఆర్సీపీని చంద్రబాబునాయుడు విమర్శించారు. మరి అదే విధంగా రాష్ట్రాభివృద్ధి గురించి నేను ఎక్కడా రాజీ పడనని చంద్రబాబు నాయుడు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: