సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరూ...శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఇక ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడీ వాడీగా సాగుతున్నాయి.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ నుంచి పలువురు కీలక నేతలు టీడీపీలోకి జంప్ కావడం..ఒకరిద్దరు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కావడం జరిగింది.  దీంతో ఇరు పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇక తెలంగాణలో కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పులు వస్తున్నాయో అస్సలు అర్థం కావడం లేదు.
Image result for janmabhoomi maa vooru
ముఖ్యంగా అధికార పార్టీలోకి టీడీపీ నేతలు జంప్ అయిన విషయం తెలిసిందే. ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమాన్ని పదకొండు రోజులు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Image result for pawan kalyan\
అంతే కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా జన్మభూమి కార్యక్రమం పేదోడికి భరోసా ఇవ్వలేకపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. అయితే 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవారని గతంలో చింతా మోహన్‌ వ్యాఖ్యానించారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు వెల్లడించారు.
Image result for jenasena
కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పేర్కొన్నారు. అంతే కాదు  పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  ఇక పవన్ కళ్యాన్ ఎవరో తనకు తెలియదని..అంతే కాదు ‘జనసేన’ పార్టీ ఉందని తెలుసు కానీ..దానికి సంబంధించిన చిహ్నం (లోగో) లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: