తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత మన పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పండుగ..హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ పండుగ వచ్చినా...ఆయా పండుగలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రజల మనసు దోచుకుంటున్నారు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగా దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు.
Image result for కైట్, స్వీట్ ఫెస్టివల్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమయింది. వెయ్యికి పైకా మిఠాయిలు ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు. కాకినాడ ఖాజా, బందరు లడ్డూలు, పదిరకాల పాయసాలు కొలువుదీరనున్నాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీలు, బెంగాళీలు, రాజస్తానీలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక అసోసియేషన్స్ మిఠాయిలను ప్రదర్శనకు తీసుకురానున్నాయి.
Image result for కైట్, స్వీట్ ఫెస్టివల్
ప్రతి మిఠాయిని ఇంట్లో తయారు చేసి తీసుకురావాలని నిబంధన విధించారు. మిఠాయిలకు గిరాకీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున విక్రయశాలలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి చందూలాల్ ప్రారంభించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ గాలిపటాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 22 దేశాలకు చెందిన ప్రతినిధులు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ లో పాల్గొన్నారు.
kite-festival-hyderabad
రాష్ట్ర భాషాసాంస్కృతికశాఖ డప్పుల దరువులు, కోలాటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుడకలు వంటి సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. జానపద కూచిపూడి, ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపకాలను ప్రదర్శించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.

Image result for కైట్, స్వీట్ ఫెస్టివల్


మరింత సమాచారం తెలుసుకోండి: