ఇటీవల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సంచలన కరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి  చేసిన వ్యాఖ్యలపై జిల్లా కు చెందిన జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పందిస్తూ మంత్రి మాణిక్యాలరావు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత ఆ మాటలను వెనుక తీసుకోవడం మంత్రి మాణిక్యాలరావు ముందునుంచి అలవాటని బాపిరాజు విమర్శించారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు గొడవ తారస్థాయికి చేరడంతో జిల్లాలో రాజకీయ వేడి హీట్ ఎక్కింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ ఇద్దరు నేతల పై సీరియస్ అయ్యారు. అసలు గొడవలకు కారణాలేంటో విచారణ చేసి నాకు తెలపాలని ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర తో కమిటీ నియమించారు.

అయితే ఈ విచారణలో భాగంగా ఎవరు క్రమశిక్షణ తప్పితే వారు ఎంతటి వారైనా సరే చర్యలు ఉంటాయని బాబు తెలిపారు. ఎన్నికల ముందు ఇలా పార్టీలో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ పరువు తీయకండి అంటూ జిల్లా నాయకులకు చంద్రబాబు సూచించారు.గత సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా మనకు ఎక్కువ సీట్లు ఇచ్చిందని చంద్రబాబు జిల్లా నాయకులకు గుర్తుచేశారు..ఈ క్రమంలో హుందాగా  వ్యవహరించాలని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: