చిత్తూరు జిల్లా రేణిగుంటలో శనివారం జోహో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..ఏపీలో ఐటీ రంగాన్ని అమెరికాలోని సిలికాన్ వ్యాలీలా తీర్చిదిద్దుతాను అని తెలిపారు..ఈ సంధర్భంగా మాట్లాడుతూ విశాఖ..తిరుపతి..అనంతపురం..అమరావతిలో సైబర్‌ టవర్లు నిర్మిస్తామని తెలిపారు.. అంతేకాదు రాష్ట్రానికి వచ్చే ఐటీ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తామని ప్రకటించారు..ఐటీ శాఖ ద్వారా సుమారు కోటి మందిని “డిజిటల్‌ లిటరేట్స్‌” చేస్తానని హామీ ఇచ్చారు.

 N. Chandrababu Naidu, Andhra Pradesh Chief Minister and Sridhar Vembu, Founder and CEO, Zoho Corp at the inauguration of Zoho's new centre at Renigunta, near Tirupati on Saturday. Photo : Bijoy Ghosh

 

ప్రతిఇంట్లో ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్..ఓ..పారిశ్రామికవేత్త ఉండేలా చేయడమే లా లక్ష్యం అని తెలిపారు ..అందుకు గాను దాదాపు రూ .250కోట్లతో లక్ష మందికి శిక్షణ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోందని తెలిపారు...ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా ఉన్నప్పుడు నేను నిర్మించిన సైబర్ టవర్స్ కారణంగానే మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ దిగ్గజాలు మరియు అనేక కంపెనీ లు వచ్చాయని అన్నారు..మర్చి నెలాకరుకల్లా పేపర్ లెస్ ఆఫీస్ గా రాష్ట్రం మారుతుందని తెలిపారు..ఈ సందర్భంగా ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ మాట్లాడుతూ..

 N. Chandrababu Naidu, Andhra Pradesh Chief Minister and Nara Lokesh, AP IT Minister at the inauguration of Zoho's new centre at Renigunta, near Tirupati on Saturday. Photo: Bijoy Ghosh

రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ  నవ్యాంధ్ర కి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్తున్నారని అన్నారు..ఏపీ కి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అంటూ తన తండ్రిని పొగిడేశారు..త్వరలోనే లక్ష మందికి ఏపీ ఆధారితంగా శిక్షణ ఇవ్వడానికి అంతా సిద్దం అవుతున్నామని తెలిపారు..ఏపీలో ఐటీ ని పరుగులు పెట్టించే భాద్యత నాపై ఎంతో ఉందని అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నాము అని తెలిపారు లోకేష్. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: