సొంతూరు.. మనం ఎంత ఎదిగినా.. మనం మరిచిపోలేని జన్మభూమి.. అందుకే జీవితంలో పైకెదిగిన ఎందరో పారిశ్రామిక వేత్తలు, నాయకులు తమ సొంతూళ్ల బాగు కోసం తపిస్తుంటారు. ఊరి బాగుకు నడుంకడతారు. రాజకీయ నాయకులు కూడా తమ సొంత నియోజకవర్గాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. అయితే ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఇదే అంశంపై సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు.

jagan padayatra కోసం చిత్ర ఫలితం
నారా చంద్రబాబునాయుడు రాజకీయంగా ఎంత ఎదిగినా తాను స్వయంగా చదువుకున్న పాఠశాలను సైతం బాగు చేయలేదని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. తను చదువుకున్న సొంత పాఠశాలను సైతం బాగు చేయించుకోలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురంలో వైఎస్ జగన్ భారీ బహిరంగ సభను నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ఆయన చదువుకున్న శేషా పురం పాఠశాల దుస్థితి ని పట్టించుకోవటం లేదన్నారు. చంద్రబాబు పుట్టిన చంద్రగిరి నియోజకవర్గానికి శఠగోపం పెట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పుట్టిన నియోజకవర్గంలో 70 శాతం గ్రామాల్లో తాగునీరు లేదన్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చంద్రబాబు విస్మరించారని జగన్  ధ్వజమెత్తారు.

jagan padayatra కోసం చిత్ర ఫలితం
ఎర్రావారి పాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఏనుగుల వల్ల పంట నష్టపోయినా రైతులను ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదన్నారు. వ్యక్తిగత స్వార్థంతో హెరిటేజ్ డైరీని అభివృద్ధి చేసుకునేందుకే లాభాల్లో ఉన్న విజయా డైరీని సీఎం మూయించివేశారని జగన్ విమర్శించారు. చంద్రగిరి  నియోజకవర్గంలో 138 పంచాయతీలు ఉన్నాయి... ఇందులో 70 శాతం ఊర్లలో తాగేందుకు నీరు లేదు...  సాగునీరు అసలే లేదు... ఈ పరిస్థితి చూసి అర్థం చేసుకోవచ్చు ఈయన గారి పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ జగన్ మండిపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: