సాధారణంగా మనం చూసే చిత్రపటాలలో దేవుళ్ళూ దేవతలూ తెల్లగా ఉంటారు. అదీ కృష్ణ భగవానుడు, రామచంద్రుడూ కృష్ణ (ద్రౌపతి) లాంటి దేవతలూ శనీశ్వరుడు వంటి కొన్ని గ్రహాలు నలుపు రంగులో ఉంటారు. మనుషుల్లో వర్ణాలున్నట్లు దేవుళ్ళలో వర్ణాలుంటే? ఈ కథ చదవండి.   
Image result for dark is divine concept images
    
దేవుళ్లకు సంబంధించిన అనేక చిత్రపటాలను, శిల్పాలు మనం ఏప్పుడూ చూస్తూనే ఉంటాం కదా! అలాగే సినిమాల్లో దేవుళ్లు, దేవతలను పాత్రల రూపం లో చూస్తూనే ఉంటాం! అయితే, అన్ని చోట్లా మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రతీ చిత్రపటంలోను చిత్రలేఖనంలోను సినిమాల్లో నూ దేవీ దేవతలు తెల్లగానే కనిపిస్తారు.

Image result for dark is divine concept images

కానీ దేవుళ్లు నల్లగా ఎందుకు ఉండరు? అనే ప్రశ్న మనకెప్పుడూ రాలేదు కదా!  అయితే చెన్నై వాసులు సుందర్ & నరేష్ అనే మిత్రులకు ఈ సందేహం వచ్చింది. దేవత ల దగ్గర కూడా ఇలా రంగుల గురించి విభేదాలెందుకు అనే ఫీలింగ్ తో వీరిద్ధరూ దేవుళ్ళపై "స్పెషల్ ఫోటో షూట్" చేయాలని నిశ్చయించారు. "డార్క్ ఈజ్ డివైన్" అనే దిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన ఈ ఫోటో షూట్ లో, అందరూ నల్ల గా ఉండే మోడల్స్ మాత్రమే కనిపిస్తారు. పైగా ఈ ఫోటో షూట్ లో అందరూ దేవుళ్ళూ దేవతలూ ఉంటారు. వారంతా నల్ల గానే అంటే కృష్ణ వర్ణం లోనే ఉంటారు. లక్ష్మి దేవి, సరస్వతి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, శివుడు, రాముడు, సీతా, ద్రౌపతి ఇలా దేవత లంతా నలుపు వర్ణంలోనే ఉంటారు.

Related image


తెలుపు రంగు లోనే దేవతలు ఎందుకు ఉండాలి? అన్న ఆలోచన నుంచే ఈ ఫోటో షూట్ ఉద్భవించగా - దీని కోసం నలుపు రంగు లోనే ఉన్న మోడల్స్ ను వెతికి మరీ షూటింగ్ చేయడం వైవిధ్యం విశేషం. ఈ బృందం లో ఒక బ్యూటీషియన్ కూడా ఉండగా, ఈ కాన్సెప్ట్ తెగ నచ్చేయడంతో, తాను కూడా నటిస్తానని చెప్పి, సీతగా నటించా రామె. లవకుశలతో సహా అందరూ నల్ల గానే కనిపించే "డార్క్ ఈజ్ డివైన్ కాన్సెప్ట్" కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

Image result for dark is divine concept images

అయితే మన పురాణ గ్రంధాల్లో విష్ణువు ఆయన అవతారాలు నీల మెఘ శ్యాముళ్ళే. అంటే బ్లు-బ్లాక్ అన్నమాట. దీన్నే కృష్ణ వర్ణం అంటారు. అందుకే శ్రీ కృష్ణ, ద్రౌపతి ఇరువురు నల్లనివారే కాబట్టి వారి పేరు కూడా "కృష్ణ" అయింది. 

Image result for dark is divine concept images

మరింత సమాచారం తెలుసుకోండి: