తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు  ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాల మునిగిపోయారు.  ఇక ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఆనందోత్సాహాల మద్య జరుపుకుంటున్నారు.  వారం రోజుల ముందు నుంచే ఎక్కడెక్కడ నుంచో తమ గ్రామాలకు చేరుకొని తమ సొంత వారితో ఆనందంతొ గడుపుతున్నారు.  ఇక సంక్రాంతి అంటే పందెలు గుర్తుకు వస్తాయి. కోళ్లు, గొర్రె పొట్టేళ్లు ఇలా ఎన్నో రకాల పందాలు జరుగుతుంటాయి.
Image result for పందుల పందెం
ఇక తమిళనాడు లో అయితే జల్లికట్టు పందెం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  సంక్రాంతి పండగ సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.  అయితే ఇది పెద్ద విచిత్రం ఏమీ కాదు..కానీ అదే గోదావరి జిల్లాలో మరో కొత్త ట్విస్ట్..అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం వినూత్నంగా పందుల పందేలు జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వరాహాలను తీసుకుని వాటి యజమానులు ఇక్కడికి తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అంటే కోళ్ళ పందెం లే గుర్తుకు వస్తాయి. ఇందుకు మరో నిర్వచనంగా సంక్రాంతి అంటే కోళ్ళ పందెం లే కాదు పందుల పందెం లు కూడా ఉంటాయి అంటున్నారు అనంతపురం వాసులు.

ఇందుకోసం ప్రత్యేకంగా గ్రౌండ్ ను ఎంపిక చేసి టెంట్లు వేసి పందుల పందెం లను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.   ఈ పందుల పోటీలకు ఉరుజాతికి చెందిన నాటు పందులను వాడుతున్నామని నిర్వాహకులు అంటున్నారు. సహజంగా పోట్లాడే సహజత్వం ఉన్న పందులను ఎంపిక చేసి వాటికి మత్తు కలిగిన ఆహారాన్ని ఇచ్చి పోటీకి ఉసి కోల్పూతున్నట్టు సమాచారం. ఇందుకు భారీగా బెట్టింగులకు పాల్పడుతున్నారని కూడా తెలియ వస్తుంది. మహబూబ్ నగర్, గద్వాల్, హిందూపురం, కల్యాణదుర్గం, కడప, బేతెంచర్ల తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 మంది తమ వరాహాలను తీసుకుని ఇక్కడికి వచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: