రాష్ట్రంలో రెండు మిత్రపక్ష పార్టీలైనా టిడిపి, బిజెపిల మధ్య సంబంధాలు అంటీ అంటనట్లు ఉన్నాయి.ఇప్పటికే మంత్రి మాణిక్యాలరావు వివాదం తెలుగుదేశం పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టిన ఈ క్రమంలో తాజాగా టీటీడీ పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ పదవి అదినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. టీటీడీ చైర్మన్ ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ కి చెందిన రాయపాటి, మురళీ మోహన్ వినిపించాయి. చివరాఖరికి ఈ పదవి ఆర్ధిక మంత్రివియ్యంకుడు పాలక మండలి చైర్మన్‌గా కడపజిల్లాకు చెందిన టీడీపీ నేత సుధాకర్‌ యాదవ్‌ను నియమించాలని టీడీపీ భావిస్తోంది.

అయితే ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ దీనిని అడ్డుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి కారణం సుధాకర్‌ యాదవ్‌ ఇటీవల క్రైస్తవుల మహాసభలలో పాల్గొన్నారట.ఇటువంటివారిని పవిత్రమైన ఆలయం చైర్మన్ గా  నియమిస్తే ఆలయం అపవిత్రత అవుతుందని సూచించారట. ఒకవేళ ఆర్ఎస్ఎస్ నిర్ణయని సీఎం త్రోసిపుచ్చి నట్లయితే, ఆర్ఎస్ఎస్ రాష్ట్రానికి సంబందించిన బీజేపి మంత్రితో రాజీనామా చేయించాల‌ని కూడా నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది.

ఇప్పుడు టిడిపికి టిటిడి ఛైర్మెన్ ని ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ ఎంట్రీ.. చంద్ర‌బాబుకు స‌రికొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి అడుగు ముందుకు వేస్తారో అని ఎదురు చూస్తున్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు. పాలనాపరంగా తీసుకొనే నిర్ణయాలలో కూడా బీజేపీ కలగజేసుకుని వివాదం సృష్టించడం కొంతమంది తెలుగుదేశం నాయకులకు మింగుడుపడటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: