తెలంగాణ విద్యుత్ కొనుగోలు పై కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి  మార్కెట్ రేటుకన్నా ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించి టిఆర్ఎస్ పెద్దలు డబ్బులు దండుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బహిరంగ చర్చకు రావాలని సవాలు విసరడం జరిగింది. చర్చకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది కానీ తర్వాత టీఆర్ఎస్ నేతలు మీ స్థాయికి మా నేతలు అవసరం లేదంటూ కొత్త వాదన తీసుకొచ్చారు.

మరోవైపు కెసిఆర్ బాల్క సుమన్‌ మిద ఆగ్రహం చెందారట అనవసరంగా చర్చకు పిలిచి కాంగ్రెస్‌కు అస్త్రం ఇచ్చారని. అయితే ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతటితో ఆగక కాంగ్రెస్‌ నాయకుడు టి.సుబ్బరామిరెడ్డి దగ్గరే తాము కొంటున్నాము గనక ఏవైనా ముడుపులు ఇచ్చారేమో అడిగితెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ క్రమంలో సుబ్బరామిరెడ్డి కాకతీయ కళాపరిషత్‌ పేరిట జరిపే బిరుదు ప్రదానాలు వగైరాల గురించి చెప్పడం కోసం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ కొనుగోలు విషయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు, తక్కువ కొటేషన్‌ ఇవ్వడం వల్లనే తమకు విద్యుత్‌ సరఫరా కాంట్రాక్టు లభించిందనీ చెప్పారు.

ఏమైతేనేం ఇది రేవంత్‌కు వ్యతిరేకంగా కెటిఆర్‌ను బలపర్చడమేనని కొందరు కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ వ్యాపార సదస్సు నిర్వహించి రాష్ట్ర రాజకీయాల లో మరియు దేశ రాజకీయాలలో మంచి పాత్ర పోషిస్తున్న కేటీఆర్, తాజాగా రేవంత్ రెడ్డికి ఇచ్చిన కేటీఆర్ సమాధానం  కాంగ్రెస్ కు దిమ్మతిరిగిపోయింది, కాంగ్రెస్ తవ్వుకొన్న గోతిలో కాంగ్రెస్ పడినట్లయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ఉన్న కొందరు సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి తీరు పట్ల అసహనం చూపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: