తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీటీడీ కల్యాణ మండపంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు నారా భువనేశ్వరి బహుమతులు అందజేశారు.
13ap-state2a
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొంతమంది మన సంప్రదాయాలను మరిచిపోతున్నారు. మన పండుగల గొప్పతనాన్ని భవిష్యత్‌ తరాలకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు. మూడు రోజులపాటు గ్రామంలో బంధువులు, ఆత్మీయులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోనున్నారు. 
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు, లోకేష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను గ్రామస్థుల నుంచి స్వయంగా స్పీకరించారు. సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. నేడు సంప్రదాయం ప్రకారం ఉదయం 10.40 గంటలకు నాగులమ్మ కట్టను దర్శించి, నాగుల పూజ చేశారు.
Image result
అనంతరం తల్లిదండ్రుల సమాధులను సందర్శించి, నివాళులర్పించారు. చంద్రబాబు రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది. తన బంధువులు, చిన్ననాటి స్నేహితులతో కలసి ఆయన హుషారుగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య కూడా నారివారిపల్లెలోనే సంక్రాంతి జరుపుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: