ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిత్యం పర్యటిస్తుంటారు. అది కూడా హెలికాప్టర్లు, విమానలోనే తిరుగుతుంటారు.. కానీ ఆయన హెలికాప్టర్ కోసం ఎంత ఖర్చవుతుంది.. ఏ సంస్థతో ఒప్పందం ఉంది. దాని కోసం ఏటా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..ఆ వివరాలు చూద్దాం.. చంద్రబాబుకు హెలికాప్టర్, విమాన సేవలందించేందుకు ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ సంస్థ సరస్ ఏవియేషన్ సంస్థతో ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 

chandrababu helicopter కోసం చిత్ర ఫలితం

2014 అక్టోబరులో కుదిరిన ఒప్పందం ప్రకారం సరస్ సంస్థ ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఈ సంస్థ సేవలందించాల్సి ఉంది. కనీస మొత్తంగా 100 గంటల ఫ్లైయింగ్ అవర్స్ ను ఈ సంస్థ నుంచి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. హెలికాప్టర్ సేవల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కారు గంటకు 2.5 లక్షల రూపాయలను చెల్లిస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం సేవలు వినియోగించుకున్నా వినియోగించుకోకపోయినా కనీసం నెలకు 25 లక్షల రూపాయల్ని సదరు సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిందే. 

chandrababu helicopter కోసం చిత్ర ఫలితం

ఏపీ ప్రభుత్వానికి హెలికాప్టర్ సేవలందించేందుక సరస్ కార్పొరేషన్ కు ప్రభుత్వం 20 కోట్లకు పైగానే ఖర్చు చేస్తోంది. లేటెస్టుగా గత మూడు నెలల కోసం 7 కోట్ల 76 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అంతే కాదు.. గత ఏడాది 14.33 కోట్ల రూపాయల మొత్తాన్ని ఎలాంటి సేవలు వినియోగించకోకుండానే ప్రైవేటు సంస్థకు చెల్లింపులు చేసిందట. 

chandrababu helicopter కోసం చిత్ర ఫలితం

ఈ విషయాలను కాగ్ తన నివేదికలో బయటపెట్టింది. ఇలా సేవలు వినియోగించుకోకుండానే ప్రజాధనాన్ని అప్పనంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం సరికాదని గుర్తు చేసింది. 
మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పర్యటనలను తప్పుబట్టే అవకాశం కూడా ఉండదు. కానీ ఇదే సొమ్ముతో సొంతంగా హెలికాప్టర్ కొనుక్కోవచ్చన్న సూచనలు కూడా వస్తున్నాయి. మరి ఏపీ సర్కారు ఆ దిశగా ఆలోచించిందో లేదో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: