2014 సాధారణ ఎన్నికలలో గెలచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని భావించిన జగన్ మోహన్ రెడ్డిని అదృష్టం వరించలేదు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ,బిజెపి మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించిందన్న విషయం అందరికీ తెలిసిందే.ఎన్నికలలో ఓటమి చెందినా ఒక త్రికూటమితో పోరాడి తీవ్ర పోటీని ఇచ్చామన్న సంతృప్తి పార్టీ శ్రేణుల్లో కనిపించింది.ఆ తరువాత పార్టీ ని బలోపేతం చేయడానికి , ప్రజలలో పార్టీ పట్ల ఒక పాజిటివ్ భావనలను తీసుకరావడానికి జగన్ విశ్వప్రయత్నాలయే చేశాడు. కొద్దికాలం తరువాత వచ్చిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలలోనూ గెలిచి తమ సత్తాను పరీక్షించుకొందామనుకున్న  వైఎస్సార్ పార్టీకి ఈ సారి కూడా నిరాశ తప్పలేదు .


ఇలా రెండు ఎన్నికలలో చతికిలపడ్డ జగన్ కు 2019 ఎన్నికలు కీలకం కానున్నాయి.2019 లో జరిగే సాధారణ ఎన్నికలు జగన్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అనడంలో సందేహమే లేదు .పార్టీలో ఫిరాయింపుల పర్వం కొనసాగుతుండడం, జనాలలో పార్టీపై పట్టుకోల్పోతుండడం, పార్టీ లోకి ఎంతమంది కొత్తనాయకులు వస్తున్నా వారికి అనుభవలేమి సమస్య ఉండడం వంటి కారణాల వల్ల జగన్ స్వయంగా తన పాదయాత్ర అనే అస్త్రం ద్వారా ప్రజలలోకి వెళ్లిన విషయం తెలిసిందే . మొత్తం 180 రోజులపాటు జరుగనున్న పాదయత్ర 3000 కిలోమీటర్లతో   125 అసెంబ్లీ స్థానాలలో జరుగనుంది. తక్కిన 50 స్థానాలకు బస్ యాత్ర ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తారని పార్టీ ప్రతినిధులు తెలిపిన విషయం తెలిసిందే .ప్రభుత్వ తీరును ఎండగడుతూ, తమ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకవెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతోమొదలైన ఈ పాదయత్ర నేటితో 63 వ రోజుకు చేరుకుంది.


అయితే  హీరో సూర్య నటించిన గ్యాంగ్ అనే సినిమా ఈ సంక్రాంతికి విడుదలయిన సంగతి తెలిసిందే .అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టుతోంది.అయితే నిన్న సంక్రాంతి రోజు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ కి హాజరయిన ఆయన జగన్ గురించి మాట్లాడుతూ "పాదయాత్ర చేస్తున్న నా అన్న  జగన్ మోహన్ రెడ్డి కి నా శుభాకాంక్షలు. వైఎస్ కుటుంబం నాకు కాలేజీ రోజుల నుండి తెలుసు.
Image result for ys jagan
ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము ఎప్పుడు కలిసినా రాజకీయాల గురించి చర్చించుకోము.అతని ఉద్దేశాలు చాలా బాగున్నాయి,వాటికోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం అపుడు నేను వారి కుటుంబంతోనే ఉన్నాను.వైఎస్ మరణం చాలా దిగ్భ్రాంతిని కలుగచేసింది.అప్పటి వైఎస్ పాదయాత్ర ఎంత ఉపయోగపడిందో ఇప్పుడు కూడా నా అన్న జగన్ మోహన్ రెడ్డి కి కూడా ఈ పాదయాత్ర అంత కలిసి రావాలనుకుంటున్నాను" అని తెలిపాడు. కాగా జగన్ కు సంబందించిన ఒక సిమెంట్ కంపెనీ కి హీరో సూర్య ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: