తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంబరంగా సంక్రాంతి వేడుకలు జరపుకున్నారు ప్రజలు.  ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు..ఎడ్ల పందాల జోరు బాగా ఉంటుంది.  ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా వారి పల్లెలో పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  ఈ వేడుకకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో నిన్న సంప్రదాయం ప్రకారం  నాగులమ్మ కట్టను దర్శించి, నాగుల పూజ చేశారు.
Image result for నారా వారి పల్లెలో దేవాన్ష్
అనంతరం తల్లిదండ్రుల సమాధులను సందర్శించి, నివాళులర్పించారు. చంద్రబాబు రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది. తన బంధువులు, చిన్ననాటి స్నేహితులతో కలసి ఆయన హుషారుగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.  ఇదంతా ఒక ఎత్తైతే..తాతగారి ఊళ్లో మనవడు సందడి చేస్తున్నాడు. సంక్రాంతి శోభకు ఈ బుల్లోడే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తూ సంక్రాంతి సంబరాలను సీఎం చంద్రబాబు తన సొంత ఊర్లో జరుపుకుంటుండగా.. ఆ ఊర్లో హడావిడి అంతా ఆయన మనవడు దేవాన్ష్‌  సెంటర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా మారాడు.

బోగి రోజు పంచ ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన దేవాన్ష్.. సంక్రాంతి రోజు కూడా సంప్రదాయ వస్త్రాదారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బుడిబుడి అడుగులు వేసుకుంటూ అమాయకంగా చూస్తున్న ఆ పసివాన్ని చూస్తూ నారావారిపల్లె వాసులు సంబరపడిపోతున్నారు. అంతే కాదు హెరిటేజ్‌ సంస్థ కార్యక్రమాన్ని తాతయ్య, అమ్మా, నానమ్మాతో పాటు ఈ బుల్లోడు కూడా ఓ గెస్టుగా వెళ్లాడు.
Image result for నారా వారి పల్లెలో దేవాన్ష్
నారా వారి వారసుడు దేవాంశ్‌ అప్పుడే అవార్డులను ఆవిష్కరించాడు. హెరిటేజ్‌ సంస్థకు వచ్చిన అవార్డులను ముఖ్యమంత్రి తన మనవడు దేవాన్ష్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. పండుగ సందర్భంగా ఎద్దులబండి తోలి అందరినీ ఆకట్టుకున్నాడు దేవాన్ష్. రైతు మాదిరి చర్నాకోల తిప్పుతూ హల్‌చల్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: