మళియాళ నటుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి తెలుగు అభిమానులకు సుపరిచితుడే.  సురేష్ గోపి నటించిన ఎన్నో క్రైమ్ తరహా చిత్రాలు తెలుగు లో డబ్బింగ్ అయ్యాయి.  90వ దశకంలో సురేష్ గోపి యాంగ్రీ పోలీస్ మాన్ గా పేరు తెచ్చుకున్నాడు.  ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ముఖ్యంగా పోలీస్ బ్యాంగ్ గ్రౌండ్, సీఐడీ, మాఫియా తరహా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 
Image result for సురేష్ గోపి
కొన్ని సినిమాలో విలన్ గా కూడా నటించారు సురేష్ గోపి. ఇక  పన్ను ఎగవేశారనే ఆరోపణలపై సురేష్ గోపిని  అరెస్టు చేసినట్లు క్రైమ్ పోలీసులు చెప్పారు. ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు.  అసలు విషయానికి వస్తే..పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు ధ్రువపత్రాలతో రెండు లగ్జరీ కార్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 

ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా సురేష్ గోపి రూ. 30 లక్షల మేర పన్ను ఎగ్గొట్టినట్లు అధికారులు అంటున్నారు.దానిపై తిరువనంతపురం కోర్టు ఆయనకు బెయిల్‌తో కూడిన అరెస్టు వారంట్ జారీ చేసింది. ఈ మేరకు  సోమవారంనాడు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. లక్ష రూపాయల బాండుతో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో సురేష్ గోపీకి బెయిల్ మంజురైంది.  అరెస్టుకు మూడు వారాల గడువు స్తూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: