తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు.  రాష్ట్రాధినేతలు సైతం పండుగ సంబరాల్లో మునిగిపోయారు.  ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ఆయన స్వగ్రామమైన నారావారి పల్లెలో బంధుమిత్రులతో సరదాగా గడిపారు.  ఈ వేడుకలకు చంద్రబాబు వియ్యంకుడు..నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. 

ఇదిలా ఉంటే ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్‌ వద్ద జగన్‌   పండుగ వేడుకల్లో ఉత్సాహం పాల్గొన్నారు.  తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వైఎస్‌ జగన్‌.. పంచె, కండువా ధరించారు.

ఈ సందర్భంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు.  వైఎస్సార్ పాదాల వద్ద జగన్ కొబ్బరికాయ కొట్టారు. వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్యర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సునీల్‌ కుమార్‌ రెడ్డి, నారాయణస్వామి, పార్టీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: