వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలుగు సంప్రదాయాలను అవమానించారా.. చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఉన్న ఆయన సంక్రాంతి తొలి రోజు భోగి మంటలు వేయాలన్న కొందరు మహిళల విజ్ఞప్తిని తిరస్కరించారా.. అంటే సంక్రాంతి సంప్రదాయాలపట్ల వైఎస్ జగన్ కు అంత సదభిప్రాయం లేదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. జగన్ వ్యతిరేక మీడియా ఈ అంశాల్లో సామాజిక వేదికలపై జోరుగా ప్రచారం చేస్తున్నాయి. 

jagan sankranthi కోసం చిత్ర ఫలితం
పాదయాత్రలో ఉన్న జగన్.. సంక్రాంతి కోసం విరామం ప్రకటించలేదు. చిత్తూరు జిల్లా నుంచి సొంత ఇంటికి వెళ్లి అక్కడ సంబరాలు జరుపుకోలేదు. అదే సీఎం చంద్రబాబు మాత్రం విజయవాడ నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చి మరీ స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చూశారా.. జగన్ కు సంప్రదాయాలు గిట్టవు.. అదే సీఎం చంద్రబాబు అయితే సంప్రదాయాలను గౌరవిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 

jagan sankranthi కోసం చిత్ర ఫలితం
ఐతే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి. జగన్ స్వతహాగా క్రైస్తవుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా ఆయన హిందూ, ముస్లిం.. ఇతర మతాల ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూనే ఉన్నారు. ఆయా మతాల వేడుకల్లో పాల్గొంటున్నారు. భోగిమంటలు వేసేందుకు ఆసక్తి చూపలేదని చెబుతున్నా.. ఆ తర్వాత రోజు జగన్ స్వయంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విషయాన్ని మరిచిపోకూడదు. 

chandrababu sankranthi కోసం చిత్ర ఫలితం

పారకాల్వ గ్రామంలో జగన్ సంప్రదాయ వస్త్రధారణతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఐతే.. తొలిరోజు సంబరాల్లో పాల్గొనలేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన రెండో రోజు సంబరాల్లో పాల్గొన్నారన్న వాదన కూడా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. మనసుల్లో ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజానాయకుడు అన్నవాడు అన్నిమతాల సంప్రదాయాలను గౌరవిస్తారు.. గౌరవించకపోయినా గౌరవించినట్టు కనిపిస్తారు. అంతే కానీ.. బహిరంగంగా విముఖత ప్రదర్శించరు.. ఏమంటారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: