జ్యోతిష్యం ఓ ఇంట్రస్టింగ్ సబ్జక్ట్.. ముందుగా ఏం జరగబోతోందో తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ ఉంటుంది. భవిష్యత్తులోకి వెళ్లి ఏం జరగబోతోందో తెలుసుకుని.. అందులో ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంటే దాన్ని సాధ్యమైనంత తగ్గించుకునే వెసులుబాటు జ్యోతిష్యం ద్వారా ఉంటుందన్నది జ్యోతిష్యం పండితుల నమ్మకం. అందుకే మంచి జ్యోతిష్యులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

Image result for rajamouli astrology

ఇక సినీ, రాజకీయ రంగాల్లో జ్యోతిష్యాలను, సెంటిమెంట్లను నమ్మేవారికి కొదువ వుండదు. ఎందుకంటే ఈ రెండు రంగాల్లోనూ విజయం అనేది ఎందుకు వస్తుందో.. పరాజయం ఎప్పుడు పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక సినిమా విజయవంతం కావాలన్నా.. ఓ రాజకీయ నాయకుడు సక్సస్ కావాలన్నా అవి.. ఎన్నో అంశాలపై ఆధారపడిఉంటాయి. అందుకే ఈ రెండు రంగాల్లోని వారు ఎక్కువగా జ్యోతిష్యాలను నమ్ముతుంటారు. పూజలు, పురస్కారాలు చేయిస్తుంటారు. 

Image result for rajamouli astrology

ప్రస్తుతం తెలుగు సినీరంగంలోనే దిగ్గజంగా పేరున్న ఎస్ ఎస్ రాజమౌళి కూడా తన జాతక బలం కోసం పూజలు చేయిస్తున్నారన్న సమాచారం ఇప్పుడ హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన తన భవిష్యత్తు కోసం మంత్రాలయంలో గ్రహపూజలు చేయిస్తున్నారని ఓ పత్రిక ప్రత్యేక కథనం రాసింది. ఆ కధనం ప్రకారం బాహుబలి 2 సినిమా వరకు ఆయనకు శుక్ర దశ నడిచిందట. ఈ దశలో ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందని ఉందట. 

Image result for rajamouli astrology

తాజాగా ఇప్పుడు శుక్ర మహార్దశ వచ్చిందట. రాబోయే దశకి గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయించాలని పండితులు చెప్పారని.. అందుకోసం ఆయన మంత్రాలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ కథనంలో ఎంతవరకూ వాస్తవం ఉందో తెలియదు. అసలు రాజమౌళి ఇలాంటి జ్యోతిష్యాలను, జాతకాలను నమ్ముతారో లేదో కూడా తెలియదు. మరి నిప్పు లేకుండానే పొగ వచ్చిందా.. అన్నది తేలాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: