ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి తన స్వగ్రామం అయిన నారావారి పల్లెలో జరుపుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ఆచారాలకు విలువ ఇస్తూ ప్రతి ఒక్కరు తమతమ కుటుంబాలతో చేరి పండగను జరుపుకోవాలని ఆయన సూచన ప్రాయకంగా తెలిపారు. పండగ రోజు ఊరంతా కలియతిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,వారి అభిప్రాయాలను కూడా సేకరించారు.


సంక్రాంతి వేడుకల మధ్యలో జరిగిన ఒక తప్పిదానికి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఒక సాధారణ వ్యక్తికి క్షమాపణలు చెప్పడం ఆయన అహంలేని వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. వివరాల్లోకెళితే సంక్రాంతి వేడుకల నిమిత్తం ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారి పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన రాకను పురస్కరించుకొని కొన్ని కార్యక్రమాలను,వేడుకలకు నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను తెలుపడానికి కూడా వేడుకల మధ్యలో ఒక సమయాన్ని కేటాయించారు.


సమస్యలను కూడా అర్జీ పెట్టుకోవచ్చు అని తెలియడంతో చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. దీనితో నారావారి పల్లెలోని సీఎం నివాసం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.ఫలితంగా పోలీసులు ఆ రోడ్ ను బ్లాక్ చేసారు. కాగా నవీన్ అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో హైదరాబాదు నుండి తన స్వగ్రామమైన మూర్తిపల్లెకు బయలుదేరాడు. తన ఊరికి వెళ్లాలంటే సీఎం ఇంటిముందు నుండి వెళ్ళాలి. పోలీసులు రోడ్డు బ్లాక్ చేయడంతో ఇంకోదారిలో వారు సీఎం ఇంటిముందుకు చేరుకున్నారు.


రోడ్డును మూసివేయడంవల్ల తన కుటుంబ సభ్యులు ఒక కిలొమీటర్ నడవవలసి వచ్చింది అని నవీన్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీన్ని గమనించిన సీఎం చంద్రబాబు స్వయంగా ఆ వ్యక్తి దగ్గరకి వచ్చి ఏర్పడిన ఇబ్బందికి క్షమాపణలు తెలిపాడు. ఏకంగా సీఎం క్షమాపణలు కోరడం పక్కనున్న వాల్లను ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమానులు మాత్రం తమ నాయకుడు గొప్పవాడంటూ మురిసిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: