సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పంతంగుల హంగామా మొదలవుతుంది. పండుగ ముందు తర్వాత కూడా పెద్దా చిన్నా అనే తేడా లేకుండా కైట్లను ఎగురవేస్తారు. అయితే కైట్లు బాగా ఎగరాలంటే సువిశాలమైన… ఎత్తైన ప్రదేశాలు చాలా అవసరం. గాలి బాగా వచ్చే దగ్గర పతంగి మంచిగ ఎగురుతుంది. అయితే ఇదే కొంతమంది ప్రాణాలకు మీదకు తీసుకు వస్తుంటాయి.  నేల పై కన్నా మేడపై నుంచి పతంగులు ఎగురవేస్తే మంచి గాలి వస్తుందని..ఎదుటి వారి పతంగులు ఈజీగా కనిపెట్టవొచ్చని అనుకుంటారు. 
Image result for kite festival in india
ఈ నేపథ్యంలో సాహసాలు చేస్తూ మేడ అంచుల వరకు వెళ్లి ప్రమాద వశాత్తు పడిపోతుంటారు. ఇలా వందల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. అదృష్ట వశాత్తు బతికే వారు కొందరైతే..అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకొని, అంగవైకల్యంతో బతికేవారు ఎంతో మంది ఉన్నారు. గుజరాత్‌లో గత వారం రోజులుగా జరుగుతున్న కైట్ ఫెస్టివల్.. పలు కుటుంబాల్లో విషాదం నింపింది.
Image result for kite festival in india
గాలిపటాలు ఎగురవేస్తుండగా సంభవించిన వివిధ ప్రమాదాలలో 16 మంది చనిపోయారు. 4 వేలకు పైగా పక్షులు గాయపడ్డాయి.  అనుకోని ప్రమాదాల వల్ల జరిగేది కొన్నైతే.. మాంజా వల్లే శరీరాలు కోసుకుపోయి ఎక్కువమంది చనిపోయారని చెబుతున్నారు అధికారులు. ఇలాంటి షార్ప్ మాంజాల వల్ల ఎన్నో వేల పక్షులు గాయాలపాలవుతాయి..ప్రాణాలు కోల్పోతున్నాయి. 
Image result for kite festival in india
ఈ వారం రోజులుగా పరిగిన పతంగుల పండుగలో..గాయపడ్డ పక్షుల లెక్క 4,026గా తేలింది. వీటికి వైద్యం అందించారు. వీటిలో చికిత్స పొందుతూ 214 పక్షులు చనిపోయాయి. ఇదిలా ఉంటే గాలిపటాలు, చైనీస్‌ లాంతరెన్స్‌, బెలూన్లు వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఎయిర్‌పోర్టు రన్‌వేపై పడిపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: