తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు.  ఈ నేపథ్యంలో ఏపీలో కోళ్ల పందాలు, పేకాట తో పాటు ఎంట్రటైన్ మెంట్ కోసం నాటకాలు, రికార్డింగ్ డ్యాన్స్ లు కూడా ఏర్పాటు చేస్తారు.  అయితే కొన్ని చోట్ల మాత్రం హద్దులు దాటి..కొంత మంది మహిళా డ్యాన్సర్లతో విచ్చలవిడిగా రెచ్చిపోతుంటారు..ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే అయినా..పోలీసులు ఆంక్షలు ఉంటాయి. 
Image result for అశ్లీల నృత్యాల
కొన్ని చోట్ల అశ్లీల నృత్యాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఆశ్లీల నృత్యాలు చేశారంటూ కొందరు మహిళా డ్యాన్సర్లను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అయితే ఈ మహిళా డ్యాన్సర్ల అరెస్ట్ సందర్భంగా పోలీసులు అనుసరించిన విధానం విమర్శలకు తావిచ్చింది.
Image result for అశ్లీల నృత్యాల
పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా మహిళలతో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. అయితే ఈ జాతరలో నిర్వాహకులతో ఒప్పందం మేరకు డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలు చేసినట్లు తెలిసింది. సమాచారమందుకున్న పోలీసులు ఆ మహిళలను అరెస్టు చేయడమేగాక నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు. కాకపోతే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

పోలీసులు వచ్చే సమయానికి అర్థనగ్నంగా ఉన్న మహిళా డ్యాన్సర్లు దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఉన్నపళానే అలాగే అర్థనగ్నంగా వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అలా చెయ్యడం సమంజసం కాదని స్థానిక మానవ హక్కుల సంఘం నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: