వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే జ‌గ‌న్‌కు సొంత పార్టీలోనే కాదు... సొంతింట్లోనే శ‌త్రువులు తిష్ట‌వేశారు. 2014లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో కోల్పోయిన అధికారాన్ని సొంతం చేసుకోవాల‌ని చూస్తోన్న జ‌గ‌న్‌కు బంధువుల నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. జ‌గ‌న్‌కు అధికార పార్టీ, సీఎం చంద్ర‌బాబుతో ఫైట్ చేయ‌డం సంగ‌తి దేవుడు ఎరుగు ముందు సొంత పార్టీలోనే ఉండి క‌ల‌హించుకుంటూ పార్టీని నాశ‌నం చేస్తోన్న శ‌త్రువుల‌తోనే పెద్ద చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ప్ర‌కాశం జిల్లా పేరు చెపితే వైసీపీకి బ‌ల‌మైన జిల్లాగా పేరుండేది. 

Image result for ysrcp

గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా ప్ర‌కాశం జిల్లాలో ఎంపీ సీటుతో పాటు మెజార్టీ సీట్ల‌ను వైసీపీ గెలుచుకుంది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో ఈ జిల్లా నుంచి య‌ర్ర‌గొండ‌పాలెం, గిద్ద‌లూరు, అద్దంకి, కందుకూరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. దీంతో జిల్లాలో వైసీపీ పూర్తిగా డీలా ప‌డిపోయింది. ఇక్క‌డ వైసీపీ నుంచి ప‌ర్చూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న గొట్టిపాటి భ‌ర‌త్‌, ద‌ర్శి ఇన్‌చార్జ్‌గా ఉన్న బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌లేమ‌ని చేతులు ఎత్తేసిన సంగ‌తి తెలిసిందే.

Related image

ఇక జిల్లా వైసీపీలో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. జ‌గ‌న్‌కు బంధువులైన ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. ఇక్క‌డ వీరిద్ద‌రి తీరుతోనే చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులతో పాటు ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా పార్టీ మారుతున్నారు. వీరిద్ద‌రి తీరుతో ఇప్ప‌టికే న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోగా, మ‌రో ఇద్ద‌రు ఇన్‌చార్జ్‌లు వచ్చే ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌మ‌ని చెప్పేశారు. దీనిని బ‌ట్టి ఇక్క‌డ పార్టీ ఎంత అధః పాతాళంలోకి ప‌డిపోతుందో అర్థ‌మ‌వుతోంది.

Image result for ysrcp

బంధువుల‌ని జ‌గ‌న్ ప్ర‌కాశం జిల్లా బాధ్య‌త‌ల‌ను వీరిద్ద‌రికి అప్ప‌గిస్తే వీరిద్ద‌రు పై చేయి కోసం ఆధిప‌త్య ఫైటింగ్‌కు దిగ‌డంతో పార్టీ ప‌రువు జిల్లాలో బ‌జారున ప‌డుతోంది. వీరిద్ద‌రు హైద‌రాబాద్‌లో ఉంటూ.. ప్ర‌కాశంలో వీరి వీరి వ‌ర్గాల‌ను మాత్రం ప్రోత్స‌హించుకుంటున్నారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్ నిర్వేదంలో మునిగిపోయింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు బంధువులే శ‌త్రువులుగా మారార‌న్న వ్యాఖ్య‌లు ప్ర‌కాశం జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక్క‌డ పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే వీరిద్ద‌రిని త‌ప్పించి ఇత‌రుల‌కు నాయ‌క‌త్వ ప‌గ్గాలు అప్ప‌గించాల్సిందే అన్న వ్యాఖ్య‌లు పార్టీ వ‌ర్గాల నుంచే వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: