అమరావతికి సాంకేతిక హంగులు దిద్దుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అమరావతి నగరాన్ని వరల్డ్ మోస్ట్ ప్రెస్టీజియస్ రాజధానిగా తీర్చే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. అమరావతి పరిసరాల్లోనూ ఐటీ పరిశ్రమను సిలికాన్ వ్యాలీ తరహాలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ ను సైబరాబాద్ నగరంగా మార్చేసిన అనుభవం ఉన్న  చంద్రబాబు..  ఇందుకోసం ప్రపంచదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారందరినీ ఒకే గొడుకుకిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే మంగళగిరిలో 16 ఐటీకంపెనీలను  ప్రారంభించిన  ఐటీ మంత్రి లోకేష్ ఆ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో నిరుద్యోగుల్లో,ఐటీ నిపుణుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. మరోవైపు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు.. ఐటీ సంస్థలు అమరావతి వైపు చూస్తున్నాయి.

Image result for apnrt it

చారిత్రక  హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటీ సెక్టార్ లో తనకున్న అనుభవాన్నంతా  రంగరించి...అమరావతిని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు.. మంగళగిరిని మైటెక్ సిటీగా మార్చేందుకు  వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి ఎన్ఆర్ టీ పార్క్ లో 13, ఆటోనగర్ ఐటీ పార్క్ లో 3 ఐటీ కంపెనీలను ఐటీ మంత్రి లోకేష్ ప్రారంభించి.. మంగళగిరి ఐటీ సిటీ రూపాంతరం చెందెందుకు ఎంతో  సమయం లేదని నిరూపిస్తున్నారు.

Image result for apnrt it

సైబరాబాద్ ను తలదన్నేలా అమరావతిలో ఐటీ రాజధానిని నిర్మిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి లో టెక్ టవర్ తో పాటు  16 ఐటీ కంపెనీలను లోకేష్  ప్రారంభించారు. ప్రపంచ స్థాయి రాజధానిని నెలకొల్పుతున్నామన్న లోకేష్.. వచ్చే రెండేళ్లలో వేలాది  ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ  ధ్యేయం అన్నారు.  


ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పటికే విశాఖ, విజయవాడల్లో మొత్తం 25కు పైగా ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన ప్రభుత్వం వేలాది మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలను కల్పించింది. తాజాగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 16 ఐటీ కంపెనీలతో తక్షణం 600 మందికి ఉపాధి లభించనుంది. వచ్చేరెండేళ్లలో ఈ ఉద్యోగాలను మరింత ఎక్కువగా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


మంగళగిరితో పాటు  వివిధ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు ప్రభుత్వం.. సుదీర్ఘ ప్రణాళికను రచించి విజయవంతంగా అమలు చేస్తోంది.  ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ సభ్యులు  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏపీఎన్ఆర్టీ, ప్రభుత్వం సంయుక్తంగా ఐటీ పరిశ్రమ విస్తరణ కృషి జరుగుతోంది.   మార్చి నాటికి లక్ష మంది ప్రవాసాంద్రులను ఏపీఎన్ఆర్టీ సభ్యులుగా చేయడంతో పాటు.. 75 కంపెనీలను అమరావతికి తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ప్రభుత్వం. విశాఖ, విజయవాడలోని గన్నవరం, మంగళగిరి, తిరుపతి సిటీల్లోనూ ఐటీ రంగాన్ని విస్తృతం చేసేందుకు  ఆంధప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: