సాధారణంగా రాజకీయ నాయకులు తమ స్వంత ప్రాంతాల నుంచి ఎన్నికల బరిలో దిగడం చాలా కామన్.. కానీ ఒక్కోసారి తమ స్వంత గ్రామం ఉన్న నియోజకవర్గాన్ని వేరే రిజర్వేషన్ అభ్యర్థులకు కేటాయిస్తే మాత్రం సదరు నాయకులు వేరే ప్రాంతాలకు రాజకీయంగా వలస వెళ్లక తప్పదు. రాష్ట్రంలోని ప్రముఖ నాయకులను తీసుకుంటే వారు సాధారణంగా తమ స్వంత నియోజకవర్గాల్లో బరిలో దిగుతుంటారు. ఆయా ప్రాంతాలపై పట్టు ఉండటమే ఇందుకు కారణం.

CHANDRABABU KUPPAM కోసం చిత్ర ఫలితం
కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంగతి అలా కాదు.. ఆయన తన సొంత గ్రామం ఉన్న ప్రాంతం వదలి కుప్పం నియోజకవర్గం నుంచి కొన్ని దశాబ్దాలుగా పోటీ చేస్తున్నారు. 
ఆయన సొంత గ్రామం ఉన్న నియోజకవర్గం చంద్రగిరి. మరి చంద్రగిరి నుంచి ఆయన ఎందుకు పోటీ చేయరు.. సొంత నియోజకవర్గం వదిలి ఆయన కుప్పం ఎందుకు వెళ్లారు. ఎందుకు అక్కడ నుంచే వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తూవస్తున్నారు. 


ఇందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తనదైన శైలిలో కారణాలు విశ్లేషిస్తున్నారు. గతంలో చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. చంద్రగిరితో పోలిస్తే కుప్పం అనేది చాలా మారుమూల ప్రాంతం.. తమిళనాడు సరిహద్దుల్లో ఓ మూలగా ఉంటుంది. చంద్రగిరి కంటే వెనుకబడి ఉంది. ఇక్కడ వెనుకబడిన వర్గాల జనాభా కూడా ఎక్కువే. సరిగ్గా  ఈ కారణాల వల్లే చంద్రబాబు చంద్రగిరి వదిలి కుప్పంలో పోటీకి దిగుతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. 

CHANDRABABU KUPPAM కోసం చిత్ర ఫలితం
వెనుకబడిన తరగతుల వారినైనే తేలికగా మోసం చేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని జగన్ వాదిస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి మాటిమాటికి బీసీ సంక్షేమం అనే మాట వస్తుందని.. ఆయన వాళ్లపై బోలెడు ప్రేమను వొలకబోస్తుంటాడని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తుంటారని.. వారిని ఆయన సులభంగా మోసం చేస్తుంటారని విమర్శించారు జగన్. బీసీలు ఎక్కువగా ఉండటం వల్లే చంద్రబాబు చంద్రగిరిని వదిలి కుప్పం నుంచి పోటీ చేస్తున్నాడన్న జగన్ వాదనలో వాస్తవం ఉందంటారా..!? 



మరింత సమాచారం తెలుసుకోండి: