ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రానికి పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీలను పెట్టుబడి రూపంలో రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది.అయితే ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు దృష్టి వ్యవసాయం మీద పడింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే అన్నపూర్ణ గా ఆంధ్రాకు పేరుంది.ఈ క్రమంలో  వ్యవసాయ రంగాన్ని మరింత బలపరచాలని సీఎం చంద్రబాబునాయుడు వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.

వ్యవసాయరంగంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయాధారిత ఆదాయంలోనూ మనమే అగ్రస్థానంలో ఉన్నాం. కేరళ సింగిల్‌ డిజిట్‌లో ఉంది. అలాంటప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది’ అని చంద్రబాబు వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత ఉన్న అనుకూలతలు గురుంచి తెలియ జెప్పడానికి విశాఖ వేదికగా చేసుకుని ఇన్వెస్టర్స్‌ మీటింగ్‌ నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు కార్పోరేట్ సంస్థలపై ఎక్కువ మక్కువ చూపడం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు వ్యవసాయం మీద ఇంత  ప్రేమ చూపించడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: