కత్తి మహేశ్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య వివాదం సంగతి తెలిసిందే. టీవీ ఛానళ్ల పుణ్యమా అని ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. వివాదం కాస్తో కూస్తే తగ్గేలోగా.. టీవీ9 లాంటి ఛానళ్లు మళ్లీ డిస్కషన్స్ కు పిలిచి వివాదాలను మరింత ఎగదోస్తున్నారు. ఇష్యూను నిత్యం లైమ్ లైట్ లో ఉండేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంలోకి మరోసారి పూనంకౌర్ ఎంటరై ఇష్యూను మరింత హాట్ హాట్ గా మార్చేస్తోంది. 

POONAM KOUR కోసం చిత్ర ఫలితం

అంతకుముందే ఒకసారి పూనం కౌర్.. కత్తి, పవన్ ఫ్యాన్స్ వివాదంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే.. దీంతో కత్తి మహేష్ ఆమెకు ఓ ఆరు ప్రశ్నలు సంధించారు. దాంతో అప్పటి నుంచి ఆమె నుంచి స్పందన కనిపించడం లేదు. ఈ వివాదంతో నాకు సంబంధం లేదు బాబోయ్ అంటూ వివాదం నుంచి పక్కకుతప్పింది. ఆ తర్వాత కత్తి మహేశ్ వాళ్ల అమ్మపై పెట్టిన ట్వీట్ కు ఖండిస్తూ ట్వీట్ చేసి ఇష్యూను కూల్ చేసింది. అంతా ఓకే అనుకున్న సమయంలో ఇప్పుడు మరో ట్వీట్ తో కలకలం రేపింది. 

POONAM KOUR VS KATHI MAHESH కోసం చిత్ర ఫలితం

తాజాగా ‘‘ఈ భారతదేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవింపబడుతూ, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. సాధారణ యువతులు దేనిపైనైనా స్పందిస్తే.. వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ, నిందలు వేస్తూ  ఉపయోగంలేని వారిగా చూపిస్తూ.. సంబంధంలేని వాటిని వారిపై అంటగడుతున్నారు. అంతా కలిసి అలాంటి యువతుల ఆత్మను, మనస్సును, శరీరాన్ని చంపేసేందుకు సిద్ధమవుతున్నారు’’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. 



దీనికీ కత్తికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. అసలు ఇష్యూ ఏంటంటే.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా  జీఎస్టీ అంటూ ఓ పోర్న్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పోర్న్ స్టార్‌తో చేసిన టీజర్ను వర్మ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసి అందులోని పోర్న్ స్టార్ మియా మల్కోవాని పొగుడుతూ కత్తి మహేష్ కొన్ని ట్వీట్స్ చేశాడు. ‘‘మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో, వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక " అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనికి కౌంటర్ గా పూనం కౌర్ పై ట్వీట్ పెట్టింది.. అంటే మరోసారి కత్తి మహేశ్ తో మాటల యుద్దానికి రెడీ అయ్యిందన్నమాట. ఈ కొత్త వివాదం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: