భారత దేశంలో ఈ మద్య మహిళలపై కొంత మంది కామాంధుల దాష్టికం విపరీతంగా పెరిగిపోయింది.  అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులతో ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో  ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో  ఓ మహిళను దారుణంగా రాళ్లతో కొట్టి సభ్య సమాజం తలదించుకునేలా పది మంది చూస్తుండగా వివస్త్రం చేసి అవమానించారు.

వివరాల్లోకి వెళితే.. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన భార్యాభర్తలకు అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కొంతకాలంగా గొడవలున్నాయి.  భాగ్యలక్ష్మి టీడీపీ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. కాగా,  భాగ్యలక్ష్మి కొంత కాలంగా తమను ఇబ్బందులకు గురిచేస్తుందని ఉమ దంపతులు ఇటీవలి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారుల విన్నవించుకున్నారు. 

ఇది కుటుంబ కలహాలని వారు పెద్దగా పట్టించుకోలేదు.  ఇదిలా ఉంటే..నిన్న ఉమ దంపతులు పక్కింట్లోని ముసలవ్వను మందలించేందుకు వెళ్తుండగా..వీరిని చూసి భాగ్యలక్ష్మి ఉమ్మివేయడంతో తమను చూసి ఎందుకు ఉమ్మివేశావు అని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన భాగ్యలక్ష్మి తన బంధువులతో కలసి వారిపై దాడికి తెగబడింది. 

అంతే కాదు తనపై జన్మభూమి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తావా అని కక్ష్య పెట్టుకొని ఉమను  వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే వివస్త్రను చేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టారు. నోటితో కొరికి దారుణంగా గాయపరిచారు. ఈ దాష్టికాన్ని ఉమ భర్త అడ్డుకోబోతే ఆయన్ని కూడా దారుణంగా గాయపరిచారు. తీవ్రగాయాలపాలైన ఉమ దంపతులను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.

అయితే భాగ్యలక్ష్మికి స్థానిక టీడీపీ నేతల అండదండలతోనే ఈ దారుణానికి ఒడిగట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. బాధితుడు తమపై జరిగిన దాడి గురించి రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: