మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట తొలిరాత్రి జీవితంలో మరుపురాని రోజుగా ఉంటుంది. ఇరువురు మనసులు ఏకమై..జీవిత భాగస్వామితో కలిసే మొదటి రోజు..ఎంతో తీపి జ్ఞాపకంగా మధురక్షణంగా ఉంటుంది.  కానీ ఆ పెళ్లి కూతురుకి మొదటి రాత్రి కాళరాత్రి అయ్యింది..పరమ శత్రువులను కూడా అంతదారుణంగా కొట్టారు..కానీ శోభనం రోజు రాత్రే భర్త ఉన్మాదిగా మారి ఆ కొత్త పెళ్లి కూతురుని ముక్కూమొఖం ఏకమయ్యేలా కొట్టాడు.  చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌కు చిన్న దామరగుంట గ్రామానికి చెందిన మునికృష్ణారెడ్డి కుమారై శైలజకు డిసెంబర్ 1వ తేదీన వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత వధూవరులను వధువు ఇంటికి తీసుకువచ్చారు. సంప్రదాయం ప్రకారం వధువు ఇంటి వద్ద శోభనం ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ తొలి రాత్రే శైలజపై దాడికి తెగబడ్డాడు. పెదవులు కొరికి, ముఖంపై పిడుగుద్దులు గుద్ది చిత్రవధ చేశాడు. తీవ్ర గాయాలతో శోభనం గది నుంచి బయటికి వచ్చిన శైలజను తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుళ్లి చికిత్స చేయించారు.   తొలిరాత్రి శోభనం గదిలోకి వచ్చిన శైలజకు రాజేష్ దాంపత్యానికి పనికిరాడన్న విషయం తెలిసింది.
Image result for potency-test-for-sadist-husband
అయితే ఈ విషయం బయటపెట్టొద్దని, పరువు పోతుందని రాజేష్ ప్రాధేయపడ్డాడు. కానీ శైలజ బయటకు వచ్చి తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపింది.తాను సరదాగా అన్నానని రాజేష్ వధువు తల్లిదండ్రులకు సర్ది చెప్పాడు. దీంతో వధూవరులిద్దరినీ మళ్లీ శోభనం గదిలోకి పంపించారు. అంతే తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజేష్.. శైలజపై విచాక్షణా రహితంగా దాడి చేశాడు.  దీంతో అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసుతోపాటు గృహహింస, చీటింగ్ కేసులు కూడా పెట్టారు.
Image result for potency-test-for-sadist-husband
దాంపత్య జీవితానికి పనికి రానని తెలిసి కూడా పెళ్లిచేసుకోవడం.. దానికి అతని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో ఈ ముగ్గురిపైనా కేసులు పెట్టారు.  కాగా, రాత్రిని కాళరాత్రిగా మార్చిన శాడిస్ట్‌ భర్త రాజేష్‌కు బెయిల్‌ మంజూరైంది. పటుత్వ పరీక్షల రిపోర్టులో రాజేష్‌ సంసార జీవితానికి పనికి వస్తాడని అతడి తరపు న్యాయవాది  త్రిమూర్తి తెలిపారు. దీంతో తల్లిదండ్రులకు కూడా చిత్తూరు జిల్లా కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేష్‌ తల్లిదండ్రులు శైలజ కావాలనే రాజేష్‌ను జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: