కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబుకు చాలా మంచి అనుభవం ఉంది. ఏ ఏ పథకాల కింద రాష్ట్రాలకు నిధులు వస్తాయి.. ఎక్కడ కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు రాబట్టుకోవచ్చన్న అంశాలపై ఆయన సమగ్రమైన అవగాహన పట్టు ఉన్నాయి. గతంలో వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నిధుల వరద పారించుకున్న అనుభవం ఆయన సొంతమన్న సంగతి మరిచిపోకూడదు. 

HYDERABAD కోసం చిత్ర ఫలితం
ఐతే.. ఇప్పుడు చంద్రబాబు వ్యూహాలు మోడీ సర్కారు ముందు అంతగా పనిచేయడం లేదు. కేంద్రం నుంచి ఆశించినంతగా సాయం అందడం లేదు. దీంతో చంద్రబాబు నీతి ఆయోగ్ ను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఏపీ పర్యటనకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ను ఆహ్వానించారు. ఆయన్ను జిల్లా కలెక్టర్ల సదస్సుకు ఆహ్వానించి స్వాగతోపన్యాసం చేయించారు. చంద్రబాబు అతిథి మర్యాదలకు రాజీవ్ కుమార్ ఖుషీ అయినా చంద్రబాబు మాత్రం షాకు మీద షాక్ తినాల్సివచ్చింది. 

chandrababu RAJEEV KUMAR కోసం చిత్ర ఫలితం

ఏపీకి అన్నివిధాలా సాయం అందించాలని.. తాము తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నామని చంద్రబాబు రాజీవ్ కుమార్ తో చెప్పారు. దానికి స్పందించిన రాజీవ్ కుమార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో పన్నులు చెల్లించేవారిలో 40 శాతం మంది ఆంధ్రావాళ్లేనని సెటైర్లు పేల్చారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావాళ్లు ఏపీకి వస్తే ఆర్థిక సమస్యలే ఉండవని సరదాగా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఏపీ ఇప్పటికే 11 నుంచి 15 శాతం వృద్ధి రేటు సాధిస్తున్నందున ప్రత్యేకంగా చేయూత అవసరం లేదని తేల్చిచెప్పారు.  

HYDERABAD కోసం చిత్ర ఫలితం
ఐతే.. తాను సరదాకే ఈ మాటలు అంటున్నానని.. సీరియస్ గా తీసుకోవద్దని రాజీవ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ తలసరి ఆదాయంలో 40 శాతం ఆంధ్రావారి నుంచి వస్తున్నదేనన్నరాజీవ్.. మీరు వారి నుంచి సహకారం తీసుకోవచ్చని చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చారు. అప్పుడు మీ తలసరి ఆదాయం లక్షా 70 వేలవరకూ వెళ్లవచ్చంటూ లెక్కలేసి చెప్పారు. హైదరాబాద్ లో ఉంటున్నవారిలో సగం మంది ఆంధ్రప్రదేశ్ లోనే వ్యాపారం చేస్తున్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. మొత్తం మీద ఏపీకి ప్రత్యేకంగా సాయం చేసేదేమీలేదని రాజీవ్ కుమార్ తేల్చి చెప్పేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: