రజినీకాంత్ ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించాడో అప్పటి నుంచి అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తలైవా రాజకీయాల్లోకి రావడం మంచి శుభ పరిణామం అని అందరు ప్రశంసించారు.అయితే రజినీకాంత్ రాజకీయాల్లో రాణించగలడా అని అందరు అభిప్రాయ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాన్నే తీసుకుంటే, పార్టీ పెట్టిన అతిత‌క్కువ కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకున్నాడు ఎన్టీ రామారావు.

Image result for rajinikanth political

తెలుగు రాష్ట్రాన్నే తీసుకుంటే, పార్టీ పెట్టిన అతిత‌క్కువ కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకున్నాడు ఎన్టీ రామారావు. ఆయ‌న‌లా మేం కూడా టాలీవుడ్ ను షేక్ చేశాం పాటిటిక్స్ ప్లే చేస్తామంటూ వ‌చ్చిన హీరోలంతా బొక్క‌బోర్లా ప‌డ్డారు.అభిమానులు ఒత్తిడి చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు సామాజిక న్యాయం చేస్తానంటూ ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ ప‌రిస్థితి ఏమైందో మ‌నమంతా చూశాం. ప‌ట్టుమ‌ని ప‌దిశాతం సీట్ల‌ను కూడా గెల‌వ‌లేక‌పోయాడు. అంతేకాదు,పార్టీని మోయ‌లేక కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్య‌స‌భ సీటుతో స‌రిపెట్టుకున్నాడు. 

Image result for rajinikanth political

ఇదిలా ఉంటే త‌మిళ‌నాడులో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేస్తూ ఇండియాటుడే-కార్వీ సంస్థ‌లు క‌లిసి స‌ర్వే జ‌రిపాయి. ఆ స‌ర్వే ఫ‌లితాలు చూస్తుంటే అన్నిపార్టీల‌కు ఈసారి గ‌డ్డుకాల‌మే అని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ స‌ర్వే ర‌జినీకాంత్ కు కోలుకోలేని షాకిచ్చింది. కేవ‌లం 33 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని తేల్చేసింది.అధికార పార్టీకి 65, డీఎంకే కూటమికి 130 సీట్లు రావ‌చ్చ‌ని పేర్కొంది.

Image result for rajinikanth political

ఎవ‌రు సీఎం కావ‌ల‌న్న ప్ర‌శ్న‌కు అధికంగా డీఎంకే అధినేత స్టాలిన్ వైపు మొగ్గారు త‌మిళులు. ర‌జినీకాంత్ వెన‌క‌బ‌డ‌టానికి త‌మిళేత‌రుడు అన్న ముద్ర ప‌డ‌ట‌మే కార‌ణం కావ‌చ్చ‌ని స‌ర్వే అభిప్రాయాన్ని వ్య‌క్త ప‌రిచింది. 234 అసెంబ్లీ స్థానాలున్న త‌మిళ‌నాడులో ఏపార్టీ అధికారంలోకి రావాల‌న్నా 118 సీట్లు అవ‌స‌రం. అలాంటిది 33 సీట్లు మాత్ర‌మే ర‌జినీకాంత్ పార్టీకి వ‌స్తాయ‌ని స‌ర్వే తేల్చ‌డం ఆయ‌న అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది.ఒక‌వేళ అదే జ‌రిగితే మ‌రో ప్ర‌జారాజ్యం కావ‌డం త‌థ్య‌మ‌ని అంటున్నారు అందరు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: