తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వారసులం అంటూ తెరపైకి చాలా మంది వచ్చారు.  అయితే వారంతా ఏ నిజనిర్ధారణ చేయలేక వెనక్కి వెళ్లారు.  ఇక రాజకీయ వారసత్వం కోసం ఇప్పటికీ అక్కడ వార్ కొనసాగుతూనే ఉంది.  ఇక జయలలిత కూతురినంటూ ఇటీవల కోర్టులో పిటిషన్‌ వేసిన అమృత జయ కూతురే అని జయ స్నేహితురాలు గీత ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. నటుడు శోభన్‌బాబు, జయకు అమృత జన్మించిందని, ఈ విషయం శశికళకు తెలుసన్నారు.

1996 నుంచి జయలలితతో అమృత సంబంధాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.  1999లో ఓసారి ఆంధ్రప్రదేశ్‌లో శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఆయన తనకు కుమార్తె ఉన్నట్లు, ఆమె అమృత అని తనతో చెప్పారన్నారు. డీఎన్‌ఏ పరీక్షల్లోనే అసలు విషయం తెలుస్తుందని అన్నారు.   జయలలిత కుమార్తె నేనే అంటూ బెంగళూరుకు చెందిన అమృత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మీరు హైకోర్టుకు వెళ్లి అక్కడ మీ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడికి రావాలని, నేరుగా ఇక్కడికే రాకూడదని సుప్రీం కోర్టు అమృతకు సూచించింది. 
అమ్మ బిడ్డను
తాజాగా జయలలిత కుమార్తెగా చెప్పుకుంటున్న అమృత వ్యవహారం మరోమారు బయటకు వచ్చింది. తాను జయ కుమార్తెనంటూ తెరపైకి వచ్చిన అమృత ఆమధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను జయ కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.   
ధైర్యం చేసిన అమృత !
ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న కేసు విచారణకు రానుంది. ఈ కేసులో అత్యంత కీలకమైనది, బలమైనది డీఎన్ఏ ఒక్కటే కాబట్టి అమృత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు ఎటువంటి నమూనాలు అందలేని సీసీఎంబీ అధికార ప్రతినిధి తెలిపారు.

వాస్తవానికి  సీసీఎంబీ ప్రైవేటు వ్యక్తుల నుంచి డీఎన్ఏ సేకరించదు. కోర్టు ఆదేశాలపై మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇక అమృత కేసు విషయానికి వస్తే ఆమె చెబుతున్న తల్లి, తండ్రి ఇద్దరూ లేరు.  ఇక జయలలిత మరణించారు కాబట్టి ఆమె రక్త నమూనాలు సేకరించే అవకాశం లేదు. ఆమె అస్థికల డీఎన్ఏను సేకరించే వీలు లేకపోతే ఆమె తోడబుట్టిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

ఆమె బంధువుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.  కేసును శాస్త్రరీత్యా నిరూపించడం అంత కష్టమైన పనేమీ కాదని మరోపక్క ట్రూత్ ల్యాబ్స్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: