భారత దేశం భిన్న సంస్కృతుల దేశం.., విభిన్న వర్గాలతో అనునిత్యం ప్రశాంతతే పరమావధిగా దేశం విరాజిల్లుతుంది... కొన్ని కొన్ని సార్లు స్వల్ప చేదు సంఘటనలు మినహా దేశం ఎప్పుడు ప్రశాంతతే కోరుకుంటూ వచ్చింది.... అది ముమ్మాటికి భారతీయుల గొప్పతనం. భారత దేశ ప్రజలు శాంతి కాముకులని ప్రపంచానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని హింసించి పరిపాలించిన బ్రిటిష్ వాడి పైనే మనం చేయేత్తలేదు. శాంతికి అసలైన వారసుడు గాంధి నేతృత్వంలో ఎంతో ఓపికతో స్వతంత్రాన్ని సాధించుకున్న భారతీయులం మనం... కాని కొందరికి దేశం పట్టదు.., జాతి గిట్టదేమో అనిపిస్తూ ఉంటుంది. రోహింగ్యాలకు మద్దతుగా వినిపిస్తున్న వాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న వేల సంఖ్యలోని రోహింగ్యాలు భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తే వారి తరపున వకాల్త పుచ్చుకొని గొంతు చించుకుంటున్నవారిది పూర్తి బాధ్యతా రాహిత్యమే అని చెప్పక తప్పదు. రోహింగ్యాలు, మరి కొందరు అనుమానస్పద విదేశీయులు భారత్ లో అక్రమంగా స్థిరపడితే జాతి భద్రతకు తూట్లు పడతాయి. దేశ పౌరుల సంక్షేమం సంక్షోభంలో కురుకుపోతుంది.

Image result for rohonga entering to india

భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రోహింగ్యాలను తిప్పి పంపడం రాజ్యాంగంలోని మూడో భాగంలో పొందు పరచిన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని కొందరు వాదిస్తున్నారు. మన రాజ్యాంగం ప్రవచించిన ప్రాథమిక హక్కులు చాలా వరకు భారత ప్రజలకే వర్తిస్తాయి. అక్రమంగా దేశంలోకి చొచ్చుకు వచ్చిన వారంతా తమకు ఆ హక్కులు వర్తింప చేయాలనడం అర్దరహితం.

Image result for india border rohingya entering to india

దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించటం భారత ప్రభుత్వ భాద్యత. అక్రమ చొరబాటు దారుల కారణంగా జనాభా స్వరూప స్వభావాల్లో, సామాజిక, ఆర్ధిక రంగాల్లో తలెత్తే సమస్యల నుండి పౌరులను కాపాడుకోవాల్సిన భాద్యత భారత ప్రభుత్వంపై ఉందన్నది నిర్వాదాంశం. పైగా విదేశీయుల చట్టం ప్రకారం అక్రమంగా వలస వచ్చిన ప్రతి ఒక్కరిని దేశం నుండి బయటకు పంపించి వేయటం ప్రభుత్వ విధి.దేశ సరిహద్దుల వెంబడి అన్ని చోట్ల కంచే లేదు. దురదృష్టవశాత్తు చాలా వరకు మన దేశ సరిహద్దులు చొరబాట్లకు వీలు కల్పించే విధంగా ఉన్నాయి. ఫలితంగా మన దేశం గడచిన కొని దశాబ్దాలుగా అక్రమ చొరబాట్ల తాకిడికి గురవుతుంది. ఈ చొరబాట్ల కారణంగా సరిహద్దులను ఆనుకొని ఉన్న వివిధ జిల్ల్లాల్లో సామాజిక వర్గాల సమతుల్యత గణనీయంగా మారిపోతుంది. దాదాపుగా సరిహద్దు జిల్లాలన్నిటిని చొరబాటుదారులు ఆక్రమించేసారు. ఫలితంగా కనీస సౌకర్యాలు అందుబాటులో లేని, ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోని దురవస్థలో అక్కడి భారతీయ పౌరులు దుర్భర స్థితిని అనుభవిస్తున్నారు. ఉగ్రవాద మూకలతో ఈ చొరబాటు దారులు నేరుగా సంబంధాలు నెరపుతూ దేశంలో సృష్టించిన హింసాకాండ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేల సంఖ్యలో దేశ పౌరులు, భద్రత దళాలను ఈ మూకలు పొట్టన పెట్టుకుంటున్నాయి. అక్రమ చొరబాటుదారుల వల్ల దేశ భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతుందనేందుకు ఎన్నో ఆధారాలున్నాయి.

Image result for rohonga entering to india

రోహింగ్యాల వల్ల ముప్పు ఒక రకంగా ఉంటె, ఇతర విదేశీయుల ద్వార ఇంకో రకంగా దేశానికి ముప్పు పొంచి ఉంది. నైజీరియన్లు.... ఇప్పుడు భారత దేశంలో పాతుకుపోయిన ఒక వలస వర్గం... దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో చదువు పేరుతో, వివిధ పనుల పేరుతో దేశంలో ఎన్నో అరాచక పనులు చేపడుతున్న ఈ దేశస్తులు ఇప్పుడు దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాజ్యమేలుతున్నారు... మొన్నటికి మొన్న దేశంలో ఎంతో పేరు కలిగిన ఒక ఐపిఎస్ అధికారి పేరు వాడుకొని లక్షల్లో మోసం చేశారు... ఏ దినపత్రిక చూసిన.., ఏ టి వి ఛానల్ పెట్టినా కాని.., వారే వారానికోసారి నైజీరియన్లు వార్తల్లో నిలవటం గమనార్హం. కొన్ని నెలల క్రితం ఏదో కేసుపై నైజీరియన్ల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తే మొత్తం అక్కడి పోలీస్ స్టేషన్ లో.., పోలీస్ లనే హడలెత్తించిన ఘన చరిత్ర నైజీరియన్ల సొంతం.

Image result for rohonga entering to india

డ్రగ్స్ అనే మహమ్మారిని వారు అంటించుకుంటూ.., మన దేశ ప్రజలకు ఆ మహమ్మారిని వ్యాపింప జేస్తూ దేశ ప్రజల జీవన విధానాన్నే మార్చేస్తూ దేశ పోలీస్ వ్యవస్థకే సవాలు విసురుతున్నారు. దేశంలో ఏ ప్రధాన సైబర్ నేరం జరిగిన కాని.., ఆ నేరానికి సంబంధించిన పునాదులు మల్లి నైజీరియన్ల వద్దే ఉండటం నిజంగా శోచనీయం... డ్రగ్స్ తో, దొంగతనాలు దోపిడీలతో, సైబర్ నేరాలతో, అసాంఘిక కార్యకలాపాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న నైజీరియన్ల వల్ల మరి దేశానికి నిజంగానే ఉపయోగం ఉందా అంటే.., ఆ విషయం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకే తెలియాలి. ఎందుకంటే దేశంలోని కొన్ని వర్గాలు తమ ప్రాంతం ఇదని, తమ బాష ఇదని, తమ మతం ఇదని..,ఎన్నో ప్రాంతీయ ఉద్యమాలు, ఎన్నో పోరు ఉద్యమాలు జరిగాయి.., జరుగుతున్నాయి. కాని మన దేశంలోకి ఎవడో వచ్చి మన దేశ ప్రజల జీవన విధానాన్నే దెబ్బ కొడుతున్న ఇతర దేశాల అరాచక శక్తులపై మాత్రం మన దేశ ప్రజలు మాత్రం ఇది మా దేశమని వారికి మన గొంతు వినిపించకపోవటం నిజంగా మన దురదృష్టం.

Image result for rohonga entering to india

అసలు నైజీరియన్ల మరియు మిగతా ఇతర వివాదాస్పద దేశాల ప్రజల వీసాలను జారి చేసి వారిని అనుమతించటం ద్వారా.., మనకు ఆర్థికంగా కాని ఏ ఇతర విషయాల ద్వారా కాని, ఏ రకంగా చూసుకున్నా మన దేశానికి, మన దేశ ప్రజలకు నష్టమే తప్పితే కించిత్తు లాభం కూడా లేదు.... వారి వీసాలను అనుమతించటం ద్వారా.., మన విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి అనుమతించటం ద్వారా మన ఆర్ధిక వ్యవస్థకు ఎంత లాభం ఉందో తెలియదు కాని.., వారు ఇక్కడకి వచ్చి చేసే పనుల వల్ల మాత్రం మన దేశానికి, దేశ ప్రజలకి రెట్టింపుకి రెట్టింపు నష్టం ఉందన్నది జగమెరిగిన సత్యం.ప్రపంచంలోని చాలా దేశాలు తమ విదేశీ వ్యవహారాల విధానాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.., కొన్ని వివాదాస్పద దేశాల ప్రజలకు వీసా కాదు కదా తమ దేశం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వ్యవహరిస్తున్న తీరుని మన భారత దేశం ఎందుకు గమనించటం లేదన్నది దేశ ప్రజలకి బొత్తిగా అర్థం కావటం లేదు. ఇప్పటికైనా మన దేశ విదేశాంగ విధానాలనే సమూలంగా మార్చి సంస్కరణల దిశగా అడుగులు వేస్తే దేశానికి, దేశ రక్షణకి., పాలకులు ఎంతో మేలు చేసిన వారవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: