రజనీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనూ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో వారికి గురువుగా భావించే భారతీరాజా.. వారిద్దరి రాజకీయ ప్రవేశంపై మాత్రం తీవ్రస్థాయిలో స్పందించారు. సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోవడం వల్లే రాజకీయ ఉపాధి చూసుకున్నారని ఎద్దేవా చేశారు..

 Image result for rajinikanth kamalhassan

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చాలాకాలంగా ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వారి కోరికను మన్నించిన రజనీకాంత్.. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో మరో నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయ ప్రవేశానికి చకచకా పావులు కదుపుతున్నారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచినట్లయింది. రజనీ రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుతమున్న డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీల భవిష్యత్ ఎలా ఉంటుందనేదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది.

 Image result for bharathiraja

రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. తమిళనాడులోని పార్టీలన్నీ వారి రాకను స్వాగతించాయి. ప్రజా మద్దతు ఉన్నంతకాలం ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ప్రముఖ దర్శకుడు భారతీరాజా మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా తప్పుబడ్డారు. తమిళేతరుడైన రజనీకాంత్ ను ఆమోదించేంత స్థాయిలో తమిళులు లేరని ఘాటుగా స్పందించారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతోనే ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారని ఆరోపించారు. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ.., రజనీకాంత్ ను అడ్డం పెట్టుకుని తమిళనాడు రాజకీయాల్లోకి రావాలనుకుంటోందని భారతీరాజా మండిపడ్డారు.

 Image result for rajini kamal

తమిళనాడులో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడింది. జయలలిత చనిపోవడం, కరుణానిధి యాక్టివ్ గా లేకపోవడంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు చుక్కాని లేని నావలాగా తయారయ్యాయి. వాళ్లద్దరూ యాక్టివ్ గా ఉన్నప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లీడర్లు ఎందుకు రాలేదని భారతీరాజా ప్రశ్నించారు. వాళ్లిద్దరూ లేని రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునేందుకే ఇప్పుడు వీరిద్దరూ బయలుదేరారని భారతీరాజా ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: