ప్రపంచంలో రక రకాల ఆచారాల ప్రకారం వివాహాలు జరుగుతుంటాయి.  నాగరికత తెలిసిన వారు కాస్త హంగూ ఆర్భాటాలతో తమ పిల్లల వివాహాలు జరిపిస్తుంటారు..ఇక ఆటవిక జాతి వారి వివాహాలు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతుంటాయి.అడవుల్లో నివసించే ఆదివాసీల పద్దుతులు కొన్ని మరి విచిత్రంగా ఉంటాయి.  నీలగిరి అడవుల్లో ఏన్నో ఏళ్ల నుంచి ఓ విచిత్రమైన ఆచారం కొనసాగుతూ వస్తుంది.  అక్కడ వివాహాలు చాలా విచిత్రమైన పద్దతిలో జరుగుతుంటాయి. 
Image result for nilgiri forest tribes
సాధారణంగా వివాహం చేసుకునే వధూ, వరుడు పెళ్లీ తర్వాత శోభనం..కొంత కాలాని పిల్లలు..ఇలా కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఆచారం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండటం చాలా వింతగొలిపే విషయం.  టోడ గిరిజన అనబడే తెగలో పెళ్లివేడుక జరిగిన తర్వాత వధువు, వరుడితో గడుపుతుంది. ఆ తర్వాత వధువు తన పుట్టింటికి వెళ్లిపోతుంది.. ఆ పెళ్లి కూతురుకి గర్భం దాల్చాలి..తాను ఒకవేళ గర్భం దాల్చకపోతే ఆ పెళ్లి జరిగినట్లు కాదు.
Related image
ఒకవేళ ఆ వధువు గర్భం దాలిస్తే..ఏడో నెల భర్త  విల్లు, బాణం తయారు చేసి భార్యకు కానుకగా ఇస్తాడు.  ఇక్కడ మరో ట్విస్టు..భర్త ఇచ్చిన కానుక భార్యకు నచ్చి తీసుకుంటే, తడే ఆమె భర్తగా గుర్తిస్తారు. అంతేకాదు తన  కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అతనేనని ఒప్పుకొవాలి. అమె గర్భంలో ఉన్న బిడ్డకు తండ్రి  అతనేనని ఒప్పుకుంటే భార్యాభర్తల్లా కలిసుండటానికి పెద్దలు ఆశీర్వాదిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: