తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు.  ఇక మోహన్‌బాబు సినీ ప్రస్థానం మొదలై 42ఏళ్లు అయిన సందర్భంగా ఆయనకు బుధవారం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదును కాకతీయ కల్చరల్ ఫెస్టివల్ వారు అందజేశారు. 

తాజాగా ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌ 2018లో రెండో రోజు శుక్రవారం ‘ఫాదర్‌ టు డాటర్‌: ది డీఎన్‌ఏ ఆఫ్‌ యాక్టింగ్‌’ పేరుతో జరిగిన సెషన్‌లో తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజకీయం పై ఎన్నో వ్యంగాస్త్రాలు వదిలారు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు.

రాజకీయం కుళ్లి పోయిందని..ప్రతి ఒక్కరూ అడ్డగోలు సంపాదనకు తెగబడ్డారని అన్నారు.  కొంత మంది నాయకులు వేలకు వేల ఎకరాల భూములు, కోట్ల డబ్బు సంపాదిస్తారు..అవి ఎక్కడ నుండి వస్తాయో తెలియదని అన్నారు.  నాకు అన్న అయిన ఎన్టీ రామారావు గారు మంచి వ్యక్తి... ఆయన నన్ను రాజ్యసభకు పంపారు. ఎటువంటి మచ్చ లేకుండా నా పదవీ కాలాన్ని పూర్తిచేశాను. 95 శాతం మంది పొలిటీషియన్లు రాస్కెల్స్‌.

ప్రజలకు ఎన్నో హామీలిస్తున్నారు. వీటిని నిలబెట్టుకునేవారెవరు? రాజకీయ నేతలు మాట నిలబెట్టుకునివుంటే ఇండియా ఇంకా మంచి స్థానంలో ఉండేద’ని మోహన్‌బాబు అన్నారు. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ లతో మీరు నటించారు కదా అన్న ప్రశ్నకు..హలో..నేను వారితో నటించలేదు..వాళ్లే నాతో నటించారని సమాధానం ఇచ్చారు.  అయితే తమిళనాట శివాజీగణేషన్, ఎంజీఆర్, అన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నేను నటించానని అన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: