జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ వివాదం రోజురోజుకీ ముదురుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం తరఫున జనసేన నాయకుడితో ఒక లేఖను విడుదల చేపించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు కూడా చేశారు. జనసేనను భ్రష్టు పట్టించే కుట్ర జరుగుతుందని అభిమానులు ఆవేశపడవద్దు అని పేర్కొన్నారు.

సమాజంలో పేరు సంపాదించడానికి కొందరు ఏవేవో మాట్లాడుతారని అవన్నీ పట్టించుకోవద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ స్థాపించినని ఇటువంటి చిల్లర గొడవలకు జనసేన కార్యకర్తలు స్పందించకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు. రాజకీయాల్లో ఇలాంటివి సాధారణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతిదీ పట్టించుకొని వెళ్తే మన చేరుకోవలసిన గమ్యానికి చేరుకోలేమని,`ఇటువంటి తరుణంలో మనపై వచ్చే విమర్శలపై మీరు ఆవేశం చెందకండి.

మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా ఒక్కోసారి హాని చేయవచ్చు. మనపై చేస్తున్న ప్రతి విమర్బను పార్టీ లెక్కగడుతూనే వుంది. అవి హద్దులు మీరుతున్నప్పుడు సమయం సందర్భం చూసి పార్టీ స్పందిస్తుంది. అంతవరకూ ఓర్పు కలిగి ఉండాలని లేకపోతే సమాజంలో జనసేన పార్టీ పట్ల నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది అని అధినాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఈ క్రమంలో కత్తి మహేష్ భిన్నంగా స్పందించారు. ఈ పని గతంలో చేసి ఉంటే బావుండేదని.. ఇప్పుడు మాత్రం ఆయన తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: