తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై నోరు పారేసుకున్నారు. గతంలో విభజనకు ముందు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లు అంటూ విమర్శ చేసిన కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను కించపరుస్తూ మాట్లాడటం బాధాకరమని అంటున్నారు కొంతమంది రాజకీయ మేధావులు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ పార్క్ హయత్‌లో జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రని ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చవద్దని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది...అంతేకాకుండా  “మేము చాలా ముందున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ కంటే చాలాచాలా ముందున్నాం” అంటూ కేసీఆర్ సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇలా  మాట్లాడటం దారుణమని అంటున్నారు. అయితే ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్ర రాష్ట్రం పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు  చేతగానివాళ్లేం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలను విభజించడం వల్ల ఎక్కువ నష్టపోయింది మాత్రం ఆంధ్ర ప్రదేశ్ అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ చాలా నష్టపోయిందని కేంద్రం కూడా సాయం చేయలేదని అయినా సరే ఆంధ్రప్రదేశ్ పలు రంగాల్లో ముందుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులే అంతర్గతంగా ఆయన విమర్శలను విభేదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభిమానం ఎక్కువని పక్క రాష్ట్రాలవాళ్ళ ని గౌరవించడం మన సాంప్రదాయం అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: