లక్ష కన్న అక్షరం మిన్న - మీ గొంతు మా కాలం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో ఉండే కొన్ని మీడియా ఛానెల్స్ ఎవరికి తోచినట్టుగా వారు ట్యాగ్ లైన్ ఈ విధంగా ఎవరికి వారు వేసేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే.. అక్షరం కన్న టిఆర్పీ వల్ల వచ్చే లక్ష మిన్న. మీ ఆవేదనే.. మాకు సంపద అనేలా మీడియా తెర వెనుక కథ నడిపిస్తోందా అనే వాదన వినిపిస్తోంది. పక్క రాష్ట్రంలో ఛానెల్స్ ఎలా ఉన్నాయో గాని స్వరాష్ట్రం లో మీడియా మాత్రం టిఆర్పీ మాయలో నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Image result for tv channels

ప్రస్తుతం కొందరి ఆవేదన ఈ విధంగా ఉంది.సాధారణ ప్రజల కన్నీటిని మరిచారు. రాజకీయ నాయకుడు తప్పు చేస్తే నిలదీయడం మరిచారు. అధికార పార్టీ అండతో ప్రతి పక్ష పార్టీ బెండు తీస్తూ కలం తో విషం కక్కుతున్నారు. అవసరం లేని వివాదాలతో డిబేట్ లు పెడుతు ఓ బాధితుడికి రక్షణ కల్పిస్తున్నాం అని ప్రలోభాలు పలుకుతున్నారు. రోజుకు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు పసిపిల్లలు ఆకలితో చనిపోతున్నారు. వైద్యం అందక ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తంగా గంటకు 100 మంది చనిపోతున్నారు అని సర్వేలు చెబుతున్నాయి. దానికి సమాధానం దొరికిందా..? ప్రమాదంలో ఉన్న పేద వాడికి రక్షణ ఉందా?. ఎన్నికలకు ముందు నాయకులు మీ మైకు మీద ఉమ్మిన అంశాలు అన్ని కరెక్ట్ గా సాగాయా.. లేక పర్లేదు అని తుడిచేసుకున్నారా?.


ఎవరో హీరో పై ఒకరు అవసరం లేని విమర్శలు చేస్తే వాడిపై  మరొకరు మాటల దాడి చేస్తే అదే పెద్ద సమస్యగా కనిపిస్తోందా?. 10 నిమిషాల్లో చెప్పాల్సిన విషయాన్ని పదే పదే పది గంటల వరకు టెలిక్యాస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి?. డిబేట్ లు పెట్టి చిన్న సమస్యలో లెక్కలేనాన్ని సమస్యలను సృష్టించింది ఎవరు?. ఒకసారి సాధారణ ప్రజల్లోకి వెళ్లి మేము చేస్తున్నది కరెక్టేనా అని అడుగు.. ఓ ప్రముఖ మీడియా ఛానల్ అర్ధమవుతోందా?. మీడియా అంటే రక్షణ కవచంలా ఉండాలి. ఇప్పుడు కొన్ని ఛానెల్స్ వల్ల మీడియా వేశ్య కన్నా దారుణంగా మరిందే అనేలా వేల గొంతుకలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు కరెక్ట్..?
ఓ మహిళ ఆకలి కోసం శరీరాన్ని అమ్ముకోవడంలో పొరపాటు ఉంది.. ఆమె ఆలోచన తప్పు కావచ్చు ..అవసరంలో న్యాయం ఉంది. 
ఎందులో అయినా అవసరం న్యాయంగా ఉండాలి గాని ఆలోచన తప్పు కాకూడదు.. ఆలోచన లేక ఆకలి కోసం ఆ పని చేస్తే ఆమెను బాధిత అంటాం.. కానీ ఆలోచన ఉండి కూడా డబ్బు కోసం అమ్ముడుపోతే దేవుడైనా సరే వేశ్యతో సమానం అనలేమా?  



మరింత సమాచారం తెలుసుకోండి: