కేసిఆర్ ఏది చేసినా అందులో ఖచ్చితంగా ఒక స్పెషల్ ఉంటుంది. అతను ఏ నిర్ణయం తీసుకున్న ఖచ్చితంగా అది ఒక సెన్సేషన్ అవుతుంది. మొన్న జిల్లా లను పునర్విభజన చేసినప్పుడు అందరు ఆశ్చర్య పోయినారు. కొత్త కొత్త ఆలోచనలు ఎటువంటి బెణుకు లేకుండా అమలు చేస్తాడని మంచి పేరు ఉంది. ఇప్పుడు కుడా అటువంటి సంచలనానికి తెర లేపాడు.

Image result for kcr

పంచాయతీ ఎన్నిక‌లను పరోక్ష పద్దతిలో నిర్వహించాలనే లక్ష్యంతో తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌పై కాంగ్రెస్ భారీ సెటైర్ వేసైంది. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆరితేరిపోయారని వ్యాఖ్యానించింది. ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే తమకు వ్యతిరేకంగా ఓట్లు పడుతాయని భయపడి కేసీఆర్‌ పరోక్ష ఎన్నికలకు సిద్ధపడుతున్నారని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Image result for kcr

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్టుగానే సర్పంచులు, వార్డు మెంబర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాతీయలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఒక పైసా కూడా కేటాయించలేదని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమీషన్‌ కింద ఇచ్చిన నిధులను కూడా ఇవ్వకుండా కరెంట్‌, వాటర్‌ బిల్లులకు కోత పెట్టిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: