వచ్చే ఎన్నికల్లో మహా కూటమిగా మారి కేసీఆర్ ని గద్దె దించడం కోసం కోదండరాం భారీ ప్లాన్ సిద్దం చేస్తున్నారు..ప్రతిపక్షాలు అన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చే పనిలోపడ్డారు..అందుకోసం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, బేజేపి ,వైసీపి ,సీపీఎం ,సిపీఐ వంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి పోటీ చేయడం వలన ఓట్లు చీలి పోతున్నాయి అదే కేసీఆర్ కి లాభం చేకూర్చుతోంది అంటూ కోదండరాం వ్యాఖ్యానిస్తున్నారు..అందుకు తగ్గట్లుగా ఓ మహా కూటమి కట్టాలి అంటూ కొత్త రాగం అందుకుంటున్నారు..

 Image result for kodandaram gaddar

కోదండరాం త్వరలోనే కొత్త  పార్టీ పెట్టనున్నారు..అదే విధంగా టి -తెలుగుదేశం ఎమ్మెల్యే బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు..ఇదిలా ఉంటే గద్దర్ కూడా పార్టీ పెట్టాలనే ఆలోచన మొదట్లో చేసినా సరే ఇప్పుడు కోదండరాం తో కలిసి పని చేయాలని భావిస్తున్నారు అయితే ఇద్దరు కూడా అనేకసార్లు కలుసుకుని రాజకీయ సమాలోచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది..ఈ సమయంలో ప్రతిపక్షాలు అన్నిటితో కలిసి మహాకూటమిగా ఏర్పడితే మనకి తిరుగు ఉండదు అనేది కోదండరాం ప్లాన్.., బిజెపినతో కలిసి నడుస్తున్న తెలుగుదేశాన్ని కూటమికి దూరంగా ఉంచాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

 Image result for r krishnaiahImage result for cpm cpi

ఒక వేళ బీజేపీకి టిడిపి మధ్య కుదరక విడిపోతే అప్పుడు టిడిపిని కలుపుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు కోదండరాం..తన ప్రయత్నాల్లో భాగంగా కోదండరామ్ గద్దర్‌తో కలిసి ఆర్ కృష్ణయ్యతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో శుక్రవారం కోదండరామ్ సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో చర్చలు జరిపారు.గత ఏడాది ఎన్నికల్లో టిడిపి సుమారు 15 సీట్లు తెలంగాణలో గెలుచుకుంది అంటే అది మామూలు విషయం కాదు ఇప్పటికీ టిడిపికి మంచి ఓటు బ్యాంక్ ఉంది అయితే బీజేపి తో తెగతెంపులు చేసుకుంటే టిడిపిని కలుపుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చారు..కాంగ్రెస్ పార్టీ బలంగా  ఉన్న కారణంగా కాంగ్రెస్ ని ముందు పెట్టి కూటమి ద్వారా టీఆర్ఎస్ ని ఎదుర్కోవాలి అనేది కోదండరాం నిర్ణయం.

 Related image

 అయితే ఈ కూటమిలోకి పవన్ జనసేన కూడా కలిస్తే మరింత బలం ఉంటుంది అనేది అందరి అభిప్రాయంగా నిర్ణయించారు కోదండరాం...త్వరలోనే వైసీపి అధినేత జగన్ తో కూడా మంతనాలు జరిపే పనిలో పడ్డారు కోదండరాం..అయితే ఈ కూటమిలో జట్టు కట్టడానికి అని పార్టీలు కలిసినా పవన్ కళ్యాణ్ కలుస్తార లేదా అనేది ప్రశ్నే..అదీ కాక..చంద్రబాబు కేసీఆర్ ప్రస్తుతం రాజకీయంగా కొట్టుకుంటున్నా..ఎన్నికల సమయంలో కలిసిపోయే అవకాశం ఉంది..కాబట్టి కోదండరాం మహా కూటమి ప్లాన్ సక్సెస్ అవుతుందా లేకా బొక్క బోర్లా పడుతుందా అనేది త్వరలో తేలిపోతుంది అంటున్నారు విశ్లేషకులు.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: