గత కొంత కాలంగా వరంగల్ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి తన పనిలో దూకుడు పెంచారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ ఆమ్రపాలికి వరంగల్ జిల్లా కోర్టు ఝలక్ ఇచ్చింది. ఐసీడీఎస్‌ కార్యాలయం ఉన్న ప్రైవేట్ భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్‌ వాహనాన్ని సీజ్‌ చేయాలని వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి శనివారం (జనవరి 20) ఆదేశాలు జారీ చేశారు.
Image result for ఆమ్రపాలి
జిల్లా అధినేతగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్ ఆమ్రపాలికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని అంటున్నారు.   ఐసీడీఎస్ భవనానికి సంబంధించి రూ. 3 లక్షలు అద్దె చెల్లించలేదంటూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కృష్ణారెడ్డి వాదనలు విన్న న్యాయమూర్తి కలెక్టర్ కారును జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Image result for ఆమ్రపాలి
కోర్టు ఆదేశాల మేరకు కారును జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్‌కు చేరుకున్నారు.తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కలెక్టర్‌గా విధులు చేపట్టిన ఆమ్రపాలి.. జిల్లా అధినేతగా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పనితనాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెకు వరంగల్ అర్బన్‌తో పాటు రూరల్ జిల్లా బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆమ్రపాలి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: