తెలుగు దేశం పార్టి అంటే ఒకప్పుడు చాలా ఫెమాస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జాతీయ పార్టీ పాలనకు విసుగెత్తిపోయిన జనాలకు రాష్ట్ర పార్టీ టీడీపీ ప్రణాళికలు సిద్ధాంతాలు నచ్చి ఒక్కసారిగా ఓటుతో కంగ్రెస్ కు దెబ్బ కొట్టి తెలుగు పార్టీపై మొగ్గు చూపారు. కానీ ఏ అధికారంలో అయినా లోపలు ఓటమిని చూపిస్తుంటాయి. అది టీడీపీ గత కొన్నేళ్లుగా చూసింది. ఇకపోతే చాలా ఏళ్ల తరువాత అధికారం లోకి వచ్చింది. అది కూడా రాష్ట్ర విభజన తరువాత. అయితే రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తోంది అనే అనుమానం అందరిలో నెలకొంది.

Image result for tdp

మొన్నటి వరకు జరిగిన కొన్ని ఎన్నికల్లో గెలుపును బట్టి చూస్తే ఆంద్రప్రదేశ్ లో బలంగానే ఉంది. కానీ తెలంగాణలో పరిస్థితి ఏమిటి?. గత ఏడాది కొన్ని స్థానాల్లో బాగానే గెలిచారు కానీ ప్రతి పక్ష హోదాను కూడా అందుకోలేదు. అంతే కాకుండా పార్టీ తరపు నుండి గెలిచిన వారిని కూడా కాపాడుకోలేదు. కానీ జంప్ అయిన నాయకులు గెలిచిన స్థానాల్లో చంద్రబాబుకు మద్దతుదారులు ఉన్నారని చెప్పవచ్చు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు ఇప్పుడు జంప్ చేసిన నాయకులని ఎలాగైనా ఓడించి రివెంజ్ తీర్చుకోవాలని ప్రణాళికలని సిద్ధం చేస్తున్నట్లు రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. 

Related image

నెక్ట్ ఏపీ లో గెలిచే ఛాన్స్ ఉంది. కానీ తెలంగాణ లో ఛాన్స్ కొంచెం కూడా లేదు. అయితే ఓ స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవచ్చు అనే అంశంపై టీడీపీ అధిష్టానం బాగా చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలాగైనా టీఆరెస్ ను ఓడించి అధికారాన్ని దక్కించికోవలని చూస్తోంది. అందుకోసం టీడీపీ తో అలాగే వామపక్షలతో కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉన్నారని మరో ప్రధాన అంశం. మరి ఈ పాలిటిక్స్ ట్రిక్స్ ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.

Image result for trs


మరింత సమాచారం తెలుసుకోండి: