మరో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ అయిన రిప‌బ్లిక్ టీవీ తాజాగా సీ ఓట‌ర్ స‌ర్వేతో క‌లిసి ఓ స‌ర్వే చేయించింది. అందులో నేష‌న‌ల్ వైడ్‌గా బీజేపీ మ‌రోసారి నేష‌న‌ల్ వైడ్‌గా విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపింది. అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి మొత్తం 25 ఎంపీ  స్థానాలలో టీడీపీ-బీజేపీ కూట‌మికి 12, వైసీపీ కి 13 వస్తుందని తెలిపింది.

అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీ ఓట‌ర్ స‌ర్వే బోగస్ సర్వే అని కొట్టిపారేసింది. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ బీజెపీ కూటమి వెనుకబడటానికి కారణం బీజేపీయే అనే సమాధానం వినిపిస్తోంది. దీనికి గల కారణం కేంద్రంలో అధికారంలో విభజనకు గురైన రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం రాష్ట్రానికి రావాల్సిన నిధులు హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో టీడీపీ బీజేపీ కూటమి వెనకబడిపోయిన వార్తలు వినబడుతున్నాయి.

క‌మ‌లానికి ఉన్న బ్యాడ్ టాక్‌తోనే ఫ‌లితాలు తారుమార‌య్యే సీన్ నెలకొని ఉంద‌ని విశ్లేష‌కులు వాదిస్తున్నారు. మొత్తం మిద ఏపీలో క‌మ‌ల‌నాధుల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌నేది వాస్త‌వం. అదే ఇలా బ‌య‌ట‌ప‌డిందని వ్యాఖ్యానిస్తున్నారు కొంద‌రు విశ్లేష‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: