తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాలా బలంగా ఉంది ఎన్నికలు వస్తే అధికారంలోకి వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు అయితే మరో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంతో ముందుకు సాగాలని తెలంగాణ టిడిపి నాయకులతో చంద్రబాబు చెప్పడం జరిగింది.

ప్రస్తుతం ఆ దిశగా తెలంగాణ తెలుగుదేశం నాయకులు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. చంద్రబాబునాయుడు కూడా కనీసం రెండు వారాలలో ఒకసారైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ తో సమావేశం అవ్వాలని అనుకొంటున్నారట. ఈసారి జరిగే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

దీంతో చంద్రబాబు పక్కా ప్రణాళికలతో తెలంగాణలో టిడిపి పార్టీ తరుపున పోటీ చేసి తరువాత టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన వారి స్థానాలలో ఇప్పుడు కొత్త నాయకులని పోటీ చేయించాలని యోచిస్తోంది తెలుగుదేశం పార్టీ.. అధికార పార్టీ లోకి జంప్ చేసిన నాయకులకి షాక్ ఇచ్చేలా వారు గెలిచినా స్థానాలలో కార్యకర్తలని బలపరచడానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిట్టి విర్రవీగుతున్న కెసిఆర్ కి బుద్ధి వచ్చేలా చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశాన్ని కి పునర్ వైభవం తెచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: